Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నాడు భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన మాటలు నేడు నిజమవుతున్నాయా?

హిందూ పురాణ గ్రంథాల్లో ధర్మం, మోక్షం, నిజాయితీ గురించి ప్రధానమైన ప్రస్తావన ఉంటుంది. వీటి గురించి శ్రీకృష్ణ భగవానుడు ఐదు వేల సంవత్సర క్రితమే చెప్పాడు. అవి హిందువుల పవిత్రగ్రంథం భగవద్గీతలో వున్నాయి.

Advertiesment
Sri Krishna
, శుక్రవారం, 5 మే 2017 (17:40 IST)
హిందూ పురాణ గ్రంథాల్లో ధర్మం, మోక్షం, నిజాయితీ గురించి ప్రధానమైన ప్రస్తావన ఉంటుంది. వీటి గురించి శ్రీకృష్ణ భగవానుడు ఐదు వేల సంవత్సర క్రితమే చెప్పాడు. అవి హిందువుల పవిత్రగ్రంథం భగవద్గీతలో వున్నాయి. ముఖ్యంగా మనుషుల్లో వచ్చే మార్పులు, సమాజంలో పెరిగిపోయే నేరాలు ఘోరాలు, వ్యక్తి నీతి-నిజాయితీ, మనిషి ఆయుష్షు తగ్గిపోవడం వంటివాటిని ప్రస్తావించాడు. అంటే 5 వేల సంవత్సరాల క్రితం చెప్పిన విషయాలు ఇపుడు నిజమవుతున్నాయట. నిజానికి ఈ మాటలు వినడానికి ఎంతో ఆశ్చర్యంగా ఉన్నాయి కదూ. కానీ, ఇది వాస్తవం. శ్రీకృష్ణుడు నాడు చెప్పిన మాటలను ఓసారి పరికిస్తే.... 
 
ప్రస్తుత రోజుల్లో మనిషి కంటే డబ్బు, ఆస్తికే విలువ, ప్రాధాన్యత ఇస్తారట. మనిషి ప్రవర్తన, వాళ్ల నడవడిక కంటే వాళ్ల సంపాదన, ఆస్తికే ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుందట. ముఖ్యంగా మంచి వ్యక్తి అని నిర్థారించేందుకు అతని గుణగణాల కంటే ఆస్తిపాస్తులు, డబ్బుతోనే గుణిస్తారట. 
 
మనుషుల్లో ఆధ్యాత్మిక చింతన పూర్తిగా తొలగిపోయి... మారువేషాలకు ఎక్కువ ఆకర్షితులవుతారట. అంటే గారడి విద్య చేసే వాళ్ళనే వక్తలుగా, స్కాలర్లుగా నమ్ముతారట. భూమ్మీద అవినీతిపరులు ఎక్కువైపోతారట. తనను తాను శక్తివంతుడని, డబ్బున్న వ్యక్తినని చెప్పుకునే వ్యక్తుల చేతుల్లోకి అధికారం, రాజకీయం చేరుతుందట. ఇలాంటివారే రాజ్యపాలన చేస్తారట. పన్నుల భారం తడిసి మోపడవుతుందట. దీంతో ఆహార ధాన్యాలు కొనుగోలు చేయలేక ఆకులు, కాండాలు, మాంసం, పండ్లు, పూలు, గింజలు వంటివి తిని జీవించాల్సిన దుర్భర పరిస్థితి వస్తుందట. సమాజంలో హింస ప్రజ్వరిల్లిపోతుందట. మహిళలపై చిత్రహింసలు మరింతగా పెరిగిపోతాయట. 
 
ప్రకృతి వైపరీత్యాలు, అకాల వర్షాలు, మంచు తుఫాన్లు, ఎండలు వంటి కరవుకాటకాల వల్ల ప్రజలు అనేక కష్టాలు పడతారట. ఫలితంగా తినడానికి తిండిలేక, తాగేందుకు నీరు లేక ఆకలిదప్పులతో పాటు అంటువ్యాధులు, రోగాలతో బాధపడుతారట. ముఖ్యంగా మనిషి జీవితకాలం 50 యేళ్ళకు పడిపోతుందట. 
 
పిల్లలు తమ తల్లిదండ్రుల సంరక్షణను ఏమాత్రం పట్టించుకోరట. అనాథాశ్రమాల్లో వదిలివేస్తారట. అంటే మున్ముందు ఉమ్మడి కుటుంబాల సంఖ్య కంటే అనాథ ఆశ్రమాల సంఖ్య పెరిగిపోతుందట. మనుషులు ప్రవర్తన కూడా క్రూరంగా మారిపోతుందట. బంధుత్వాలు, రక్తసంబంధీకులను కూడా పట్టించుకోకుండా అత్యంత క్రూరంగా ప్రవర్తిస్తూ.. అవసరమైతే హత్య చేసేందుకు కూడా వెనుకాడరట. అన్నిటికంటే ప్రధానమైనది.. నాగరికత ఏమాత్రం తెలియని వాళ్ళకు దేవాలయాల నిర్వహణా బాధ్యతలను అప్పగిస్తారట. అదే కలియుగ అంతానికి నాంది పలుకుతుందట.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తితిదే ఆన్‌లైన్‌లో 54,421 సేవా టిక్కెట్ల విడుదల - 10 నిమిషాల్లో హాంఫట్