Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తెలంగాణాను అతి ప్రధానమైన వ్యవసాయ ఎగుమతి కేంద్రంగా మలచాలంటే?

తెలంగాణాను అతి ప్రధానమైన వ్యవసాయ ఎగుమతి కేంద్రంగా మలచాలంటే?
, మంగళవారం, 28 డిశెంబరు 2021 (17:20 IST)
నాణ్యమైన ఇన్‌పుట్స్‌ మరియు అత్యాధునిక సాంకేతికత వినియోగం అంటే పంట రక్షణ కోసం డ్రోన్లు వంటివి వినియోగించడమనేది తెలంగాణా నుంచి వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులను వృద్ధి చేయడంలో అత్యంత కీలకం  మరియు ఇతరులు అనుసరించేలా రోల్‌ మోడల్‌గా నిలిచేందుకు సైతం ఇది అవసరం అని నేడు హైదరాబాద్‌లో జరిగిన ఓ సమావేశంలో ధనుకా గ్రూప్‌ ఛైర్మన్‌ శ్రీ ఆర్‌ జి అగర్వాల్‌ అన్నారు.

 
డ్రోన్లు, రోబోటిక్స్‌ మరియు కృత్రిమ మేథస్సు (ఏఐ) సహాయం తీసుకోవడంతో పాటుగా నాణ్యమైన విత్తనాల వినియోగం, సరైన ఎరువులు, పురుగుమందులను వినియోగించడం ద్వారా వ్యవసాయ దిగుబడులను, పంట నాణ్యతను తద్వారా రైతుల ఆదాయం వృద్ధి చేసుకోవాల్సిందిగా శ్రీ అగర్వాల్‌ రైతులకు పిలుపునిచ్చారు.

 
అపారమైన వనరులు, ఉత్సాహపూరితమైన వ్యవసాయ సమాజం కారణంగా, తెలంగాణా రాష్ట్రానికి వ్యవసాయ ఎగుమతులపరంగా అతి ప్రధానమైన కేంద్రంగా నిలిచే సామర్ధ్యం ఉందని ఆయన అన్నారు. ఆయనే మాట్లాడుతూ అత్యాధునిక సాంకేతికత, నాణ్యమైన ఇన్‌పుట్స్‌ వినియోగించడం వల్ల కలిగే సుదీర్ఘకాల ప్రయోజనాలను గురించి రైతులకు అవగాహన కల్పించడం తక్షణావసరం అని అన్నారు.

 
‘‘రైతులు తమ పంట రక్షణ కోసం సాంకేతికత వినియోగించడమనేది, వ్యవసాయ ఎగుమతుల పరంగా తమ సామర్థ్యం తెలుసుకునేందుకు, తెలంగాణా రాష్ట్రానికి ఎంతగానో సహాయపడుతుంద’’ని శ్రీ అగర్వాల్‌ వెల్లడించారు. అత్యాధునిక సాంకేతికతను ప్రోత్సహించడంలో, తద్వారా రైతుల ఆదాయం వృద్ధి చేయడంలో ధనుకా గ్రూప్‌ ఎల్లప్పుడూ ముందే ఉంటుంది. ఈ కంపెనీకి అత్యాధునిక సాంకేతిక పంట రక్షణ ఉత్పత్తులు (హెర్బిసైడ్స్‌, ఇన్‌సెక్టిసైడ్స్‌, ఫంగిసైడ్స్‌ మరియు ప్లాంట్‌ గ్రోత్‌ రెగ్యులేటర్స్‌) ఉన్నాయి మరియు రెండు అమెరికన్‌, మూడు యూరోపియన్‌, ఆరు జపనీస్‌ సంస్థలతో  సాంకేతిక భాగస్వామ్యాలు కూడా ఉన్నాయి.

 
సరైన మరియు చక్కటి ఇన్‌పుట్స్‌ వినియోగంతో రైతులు తమ ఎగుమతుల వాటాను సైతం వృద్ధి చేసుకోగలరని శ్రీ అగర్వాల్‌ వెల్లడిస్తూ రైతుల ఆదాయం రెట్టింపు చేయాలనే కల సాకారంలోనూ ఇది సహాయపడుతుందని వెల్లడించారు.

 
‘‘నాణ్యమైన భారతీయ వ్యవసాయ ఉత్పత్తులకు విదేశీ మార్కెట్‌లలో విస్తృతస్థాయి  మార్కెట్‌ ఉంది. ఇక్కడ అత్యంత కీలకమైన పదం ‘నాణ్యత’. రైతులు తప్పనిసరిగా నాణ్యమైన ఇన్‌పుట్స్‌ వినియోగించడం, అత్యాధునిక సాంకేతికత సహాయం తీసుకోవడం ద్వారా ఓ ఎకరాకు వచ్చే దిగుబడిని వృద్ధి చేయవచ్చు. ఇది వారి ఎగుమతులను సైతం వృద్ధి చేయడంతో పాటుగా ఆదాయమూ వృద్ధి చేస్తుంది’’ అని అగర్వాల్‌ అన్నారు.

 
వ్యవసాయ రంగంలో శాస్త్రీయ, అత్యాధునిక సాంకేతికతలను వినియోగించడం ద్వారా కలిగే పూర్తి ప్రయోజనాలను గురించి రైతులకు పూర్తి అవగాహనను మెరుగుపరచాల్సి ఉంది అని ఆయన నొక్కి చెప్పారు. ఈ కార్యక్రమంలోనే ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణా రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, హైదరాబాద్‌తో ఓ అవగాహన ఒప్పందంను సైతం ధనుకా గ్రూప్‌ చేసుకుంది. ఈ అవగాహన ఒప్పందంలో భాగంగా రెండు సంస్థలూ సాంకేతిక పరిజ్ఞానంపై సమిష్టిగా పనిచేయడంతో పాటుగా రైతులకు భారీ స్థాయిలో మద్దతునందించనున్నాయి.

 
ధనుకా గ్రూప్‌ ఇప్పుడు యూనివర్శిటీ నిర్వహించే సదస్సులలో పాల్గొనడంతో పాటుగా స్పాన్సర్‌ చేయనుంది. అంతేకాకుండా యూనివర్శిటీతో కలిసి ఉమ్మడిగా పరిశోధనలను పంట రక్షణ రసాయనాలలో చేయనుంది. యూనివర్శిటీతో భాగస్వామ్యం చేసుకోవడం ద్వారా ధనుకా ఇప్పుడు రైతులను పంటదిగుబడి వృద్ధి చేయడంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నటువంటి ఆధునిక వ్యవసాయ సాంకేతికతలను వినియోగించాల్సిందిగా ప్రోత్సహిస్తోంది.

 
మనదేశానికి పునాది అయిన రైతుల ఆదాయం వృద్ధి చేసేందుకు ధనుకా గ్రూప్‌ కృషి చేస్తోంది. ఈ తరహా కార్యక్రమాలు, రైతుల ఆదాయం రెట్టింపు చేయాలనే గౌరవనీయ ప్రధానమంత్రి కలలను సాకారం చేయడంతో పాటుగా భారతదేశాన్ని 5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్ధిక వ్యవస్థగా మార్చడంలోనూ తోడ్పడతాయి. ఎందుకంటే భారత ఆర్ధిక వ్యవస్థలో ఒక ట్రిలియన్‌ డాలర్లకు పైగా తోడ్పాటును వ్యవసాయ రంగమే అందిస్తుంది అని అగర్వాల్‌ అన్నారు. ఆయనే మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన పలు కార్యక్రమాల పూర్తి స్ధాయి ప్రయోజనాలను స్వీకరించడం ద్వారా వ్యవసాయ దిగుబడిని సైతం వృద్ధి చేసుకోవాల్సిందిగా పిలుపునిచ్చారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కాన్పూరులో ప్రధాని మోడీ మెట్రో జర్నీ