Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఐపీఎల్‌ అధికారిక భాగస్వామిగా చేరిన అప్‌స్టాక్స్‌

ఐపీఎల్‌ అధికారిక భాగస్వామిగా చేరిన అప్‌స్టాక్స్‌
, బుధవారం, 17 మార్చి 2021 (16:12 IST)
ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ గవర్నరింగ్‌ కౌన్సిల్‌ (ఐపీఎల్‌జీసీ) నేడు భారతదేశంలో సుప్రసిద్ధ, అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న డిజిటల్‌ బ్రోకరేజీ సంస్ధ అప్‌స్టాక్స్‌‌ను ఐపీఎల్‌ అధికారిక భాగస్వామిగా ఎన్నుకున్నట్లుగా వెల్లడించింది. ఐపీఎల్‌  ఏప్రిల్‌ 09, 2021వ తేదీన ప్రారంభం కానుంది.
 
ఐపీఎల్‌ ఛైర్మన్‌ శ్రీ బ్రిజేష్‌ పటేల్‌ మాట్లాడుతూ, ‘‘ఐపీఎల్‌ 2021కు అధికారిక భాగస్వామిగా అప్‌స్టాక్స్‌ మా బోర్డ్‌పై రావడం పట్ల సంతోషంగా ఉన్నాము. భారతదేశంలో ఎక్కువ మంది వీక్షించే క్రికెట్‌లీగ్‌గా ఐపీఎల్‌ నిలిస్తే, భారతదేశంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న డిజిటల్‌ వాణిజ్య వేదికగా అప్‌స్టాక్స్‌ నిలుస్తుంది. ఈ ఇరు సంస్థల కలయిక ప్రేక్షకులపై భారీ ప్రభావం సృష్టించనుంది. మరీ ముఖ్యంగా తమ ఆర్థిక పోర్ట్‌ఫోలియోలను నిర్వహించేందుకు మరిన్ని అవకాశాలను కోసం వెదుకుతున్న యువతపై ఇది ప్రభావం చూపనుంది’’ అని అన్నారు.
 
ఈ భాగస్వామ్యం గురించి శ్రీ రవికుమార్‌, కో-ఫౌండర్‌ అండ్‌ సీఈఓ, అప్‌స్టాక్స్‌ మాట్లాడుతూ ‘‘ఐపీఎల్‌ 2021 కోసం బీసీసీఐతో భాగస్వామ్యం చేసుకోవడం సంతోషంగా ఉంది. క్రికెట్‌ కేవలం ఓ క్రీడ మాత్రమే కాదు, మన సంస్కృతి, సామాజిక జీవితంలో కూడా అత్యంత కీలకం. భారతదేశపు ఆర్ధిక రంగంలో విప్లవాత్మక మార్పులను తీసుకువచ్చిన అప్‌స్టాక్స్‌ లాగానే భారత క్రికెట్‌లో నూతన మార్గాన్ని ఐపీఎల్‌ వేసింది. క్రీడలతో ఇప్పుడు ఆర్ధికాన్ని కలుపడం ద్వారా దేశంలో ఆర్ధిక అవగాహనను విస్తరించనున్నాం’’ అని అన్నారు.
 
స్టాక్‌ మరియు మ్యూచువల్‌ ఫండ్‌ రంగంలోని ఓ బ్రాండ్‌ , ఈ రంగాల పట్ల అవగాహన కల్పించడానికి  ఐపీఎల్‌ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఈ భాగస్వామ్యం చేసుకుంది.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జమిలి ఎన్నికలకు జైకొట్టిన పార్లమెంట్ ప్యానెల్