Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వాట్సాప్‌ ద్వారా ఐపీఓ దరఖాస్తు, డీమ్యాట్‌ ఖాతా తెరిచే అవకాశాన్ని అందిస్తున్న అప్‌స్టాక్స్‌

వాట్సాప్‌ ద్వారా ఐపీఓ దరఖాస్తు, డీమ్యాట్‌ ఖాతా తెరిచే అవకాశాన్ని అందిస్తున్న అప్‌స్టాక్స్‌
, బుధవారం, 1 డిశెంబరు 2021 (19:19 IST)
భారతదేశంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న పెట్టుబడి వేదికలలో ఒకటిగా వెలుగొందుతున్న అప్‌స్టాక్స్‌, తామిప్పుడు మదుపరులు తొలి పబ్లిక్‌ ఆఫరింగ్స్‌ (ఐపీఓ)లో పెట్టుబడులు పెట్టడంతో పాటుగా వాట్సాప్‌ ద్వారా డీమ్యాట్‌  ఖాతాలనూ తెరిచే అవకాశం కల్పిస్తున్నట్లు నేడు వెల్లడించింది.

 
అప్‌స్టాక్స్‌ ఇప్పుడు వాట్సాన్‌ ద్వారా ఐపీఓ అప్లికేషన్‌లకు పూర్తి స్థాయిలో మద్దతునందిస్తుంది. అదే సమయంలో ఖాతా తెరిచే ప్రక్రియనూ అత్యంత సులభంగా మారుస్తుంది. అక్టోబర్‌ 2021 నాటికి అప్‌స్టాక్‌ తమ వినియోగదారుల సంఖ్యను ఒక మిలియన్‌ పెంచుకోవడంతో పాటుగా ఏడు మిలియన్‌లకు పైగా వినియోగదారులను కలిగి ఉంది. 2022 ఆర్థిక సంవత్సరాంతానికి 10 మిలియన్‌లకు ఈ సంఖ్యను చేర్చాలన్నది లక్ష్యం.

 
ఈ తాజా ఫీచర్లలో అత్యంత కీలకమైన అంశం, మదుపరులు అంతా, అంటే వారు నమోదిత అప్‌స్టాక్స్‌ మదుపరులు అయినా లేదంటే ఇతరులు అయినా ఇప్పుడు ఏదైనా ఐపీఓకు తమ వాట్సాప్‌ చాట్‌ నుంచి బయటకు రాకుండానే చందా చేయవచ్చు.

 
వాట్సాప్‌ ద్వారా అప్‌స్టాక్స్‌తో ఖాతా తెరిచేందుకు కేవలం కొద్ది నిమిషాల సమయం మాత్రమే పడుతుంది.  అప్‌స్టాక్‌ రిసోర్శెస్‌ మరియు గెట్‌ సపోర్ట్‌ వంటి ట్యాబ్‌లు వినియోగదారులకు ఎఫ్‌ఏక్యులకు నేరుగా యాక్సెస్‌ అందించడంతో పాటుగా వాస్తవ సమయంలో  అప్‌స్టాక్స్‌ గురించి తగిన సమాచారం అందిస్తుంది.

 
అప్‌స్టాక్స్‌ కో-ఫౌండర్‌ శ్రీ శ్రీని విశ్వనాథ్‌ మాట్లాడుతూ, ‘‘నేడు వినియోగదారులు ప్రయాణ సమయంలో కూడా పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారు. అప్‌స్టాక్స్‌ వద్ద మేము అత్యున్నత సాంకేతిక ఆధారిత పెట్టుబడుల పరిష్కారాలను వినియోగదారులకు అందిస్తున్నాము’’ అని అన్నారు. వాట్సాప్‌ ద్వారా అప్‌స్టాక్స్‌పై లావాదేవీలను అప్‌స్టాక్స్‌ వెరిఫైడ్‌ వాట్సాప్‌ ప్రొఫైల్‌ నెంబర్‌ 93212 61098కు వినియోగదారులు తమ మొబైల్‌ ఫోన్‌ నుంచి ‘హాయ్‌’  అని సందేశం అందించడం ద్వారా కనెక్ట్‌ కావొచ్చు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీ వరద బాధితుల కోసం టాలీవుడ్ హీరో ఆర్థిక సాయం...