Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

విదేశీ ప్రవేశానికి తొలి కేంద్రంగా భారతదేశాన్ని ఎంచుకున్న యుకెకు చెందిన బ్యాంకింగ్‌ ఫిన్‌టెక్‌, టైడ్‌

Advertiesment
విదేశీ ప్రవేశానికి తొలి కేంద్రంగా భారతదేశాన్ని ఎంచుకున్న యుకెకు చెందిన బ్యాంకింగ్‌ ఫిన్‌టెక్‌, టైడ్‌
, మంగళవారం, 19 జనవరి 2021 (17:43 IST)
హైదరాబాద్‌: యుకెలో సుప్రసిద్ధ వ్యాపార బ్యాంకింగ్‌ ఫిన్‌టెక్‌ సంస్థ, టైడ్‌ తమ తొలి విదేశీ గమ్యస్థానంగా భారతదేశాన్ని ఎంచుకుంది. ప్రయోగాత్మకంగా 2021 తొలి త్రైమాసంలో ఇక్కడ కార్యకలాపాలు ప్రారంభించడంతో పాటుగా అనంతర కాలంలో దేశవ్యాప్తంగా కార్యకలాపాలు ఆరంభించనుంది. టైడ్‌ ఇప్పటికే దేశీయంగా ఓ అనుబంధ సంస్ధను ఆవిష్కరణ కోసం నియమించింది. గురుగావ్‌ కేంద్రంగా ఇండియా సిఈవో మరియు కమర్షియల్‌ బృందం కార్యకలాపాలు నిర్వహించనుంది. 
 
తమ రెండవ కార్యాలయాన్ని హైదరాబాద్‌లో  ఏర్పాటుచేయనుంది. హైదరాబాద్‌ ఇప్పుడు టైడ్‌ సంస్ధకు అంతర్జాతీయ డెవలప్‌మెంట్‌ కేంద్రంగా నిలువనుంది. ఇప్పటికే ఇక్కడ 100కు పైగా టెక్నాలజీ ప్రొఫెషనల్స్‌ నియమితులయ్యారు. హైదరాబాద్‌ మరియు ఢిల్లీ ఎన్‌సీఆర్‌లలోని బృందాలు అత్యంత వేగంగా వృద్ధి చెందడంతో పాటుగా భారతదేశంలో టైడ్‌ ఎదుగుదలకు మద్దతునందించనున్నారు.
 
భారతదేశంలో కార్యక్రమాలకు గుర్జోద్‌పాల్‌ సింగ్‌ నేతృత్వం వహించనున్నారు. గతంలో ఆయన భారతదేశపు సుప్రసిద్ధ పీఎస్‌పీ వ్యాపారం పేయులో సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌గా విధులను నిర్వర్తించారు. ఆయనకు టైడ్‌ సీఈవో, ఆలీవర్‌ ప్రిల్‌ మరియు సీటీఓ గై డంకెన్‌లు మద్దతునందించనున్నారు. వీరిరువురూ అంతర్జాతీయ వ్యాపారాలను నిర్వహిస్తున్నారు.
 
భారతదేశంలో ప్రవేశం గురించి టైడ్‌ సీఈవో ఆలీవర్‌ ప్రిల్‌ మాట్లాడుతూ, ‘‘ దాదాపు 63 మిలియన్ల ఎస్‌ఎంఈలతో  అంతర్జాతీయంగా 10వ వంతు ఎస్‌ఎంఈలకు నిలయంగా భారతదేశం నిలుస్తుంది మరియు ప్రపంచవ్యాప్తంగా రెండవ అతి పెద్ద పర్యావరణ వ్యవస్థ ఇక్కడ ఉండటం ద్వారా వ్యవస్థాపక సంస్కృతి కూడా ఉంది. అంతర్జాతీయంగా అగ్రగామి ఫిన్‌టెక్‌ కేంద్రాలలో ఒకటిగా ఇది వెలుగొందుతుంది. ఇక్కడ ఉన్న వాణిజ్య అవకాశాలతో పాటుగా, మార్కెట్‌లో టైడ్‌ మేనేజ్‌మెంట్‌ బృందంయొక్క విస్తృతస్ధాయి అనుభవం వంటివి మా అంతర్జాతీయ విస్తరణ ప్రయాణంలో తొలి కేంద్రంగా భారతదేశాన్ని ఎంచుకునేలా చేశాయి.
 
చిన్న వ్యాపారాలకు కనీస అవసరాలు విశ్వవ్యాప్తమైనవి మరియు టైడ్‌ యొక్క చురుకైన నిర్మాణం, ఎలాంటి మార్కెట్‌లో అయినా వ్యాపార అవసరాలకనుగుణంగా స్థానిక ఉత్పత్తి సేవాభాగస్వాములతో కలిసి స్వీకరించవచ్చు మరియు అనుసంధానించవచ్చనతగ్గ రీతిలో ఉంటుంది. భారతీయ ఎంఎస్‌ఎంఈలకు సహాయమందించడానికి మేమిప్పటికే పొందిన జ్ఞానాన్ని వినియోగించగలము. గుర్జోద్‌పాల్‌ సింగ్‌ ఇప్పుడు భారతదేశంలో మా వ్యాపారాలను ముందుకు తీసుకువెళ్తుండటం పట్ల సంతోషంగా ఉన్నాము. ఎన్నో సంవత్సరాలుగా భారతీయ ఎస్‌ఎంఈలకు సేవలనందించడంలో ఆయన అపార అనుభవం అత్యంత కీలకం కానుంది’’ అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు, మొదటి రోజు శోభనానికి రాలేదని పొడిచి పొడిచి...