Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కార్పొరేట్‌ పాలనలో శ్రేష్టత కోసం ఐసీఎస్‌ఐ జాతీయ అవార్డును అందుకున్న ఐటీసీ లిమిటెడ్‌

కార్పొరేట్‌ పాలనలో శ్రేష్టత కోసం ఐసీఎస్‌ఐ జాతీయ అవార్డును అందుకున్న ఐటీసీ లిమిటెడ్‌
, శనివారం, 16 జనవరి 2021 (19:58 IST)
స్థిరమైన వృద్ధి, పనితీరు, సహాయక సామర్ధ్యాలు, పరిపాలన విలువలు, సీఎస్‌ఆర్‌ దిశగా సున్నితమైన విధానాలు మరియు స్థిరమైన వృద్ధికి గుర్తింపుగా ‘బెస్ట్‌ గవర్నెడ్‌ కంపెనీ’గా ఐటీసీ లిమిటెడ్‌ను కార్పోరేట్‌ పరిపాలనలో శ్రేష్ణత కోసం 20వ ఐసీఎస్‌ఐ జాతీయ అవార్డుల వద్ద గుర్తించారు. ఈ అవార్డు కోసం గౌరవనీయ న్యాయమూర్తి శ్రీ ఏ కె సిక్రీ, పూర్వ న్యాయమూర్తి, భారత సుప్రంకోర్టు మరియు ఇంటర్నేషనల్‌ జడ్జ్‌, సింగపూర్‌ ఇంటర్నేషనల్‌ కమర్షియల్‌ కోర్ట్‌ నేతృత్వంలోని న్యాయనిర్ణేతల బృందం ఐటీసీని గుర్తించింది.
 
ఐటీసీ యొక్క కంపెనీ సెక్రటరీ, రాజేంద్ర కుమార్‌ సింఘిని ‘గవర్నెన్స్‌ ప్రొఫెషనల్‌ ఆఫ్‌ ద ఇయర్‌’గా సైతం ఎంపిక చేశారు. ప్రభావవంతమైన పరిపాలనా ప్రక్రియలను స్వీకరించేదిశగా ఆయన అందించిన తోడ్పాటుకు ఈ అవార్డును అందజేశారు. ఐటీసీ తరపున ఈ అవార్డును శ్రీ సింఘి 13జనవరి2021వ తేదీన జరిగిన వేడుకలో స్వీకరించారు. భారత ప్రభుత్వ రైల్వేలు, వాణిజ్యం, పరిశ్రమలు, వినియోగదారుల వ్యవహారాలు శాఖామాత్యులు శ్రీ పియూష్‌ గోయల్‌ ఈ అవార్డుల వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ వేడుకలో భారతీయ కార్పోరేట్‌ రంగతో పాటుగా ప్రభుత్వ రంగ ప్రొఫెషనల్స్‌ సైతం పాల్గొన్నారు.
 
ఈ అవార్డును అందజేసిన ఐసీఎస్‌ఐకు ధన్యవాదములు తెలిపిన ఛైర్మన్‌ శ్రీ సంజీవ్‌ పూరి మాట్లాడుతూ, ‘‘నీతివంతమైన కార్పోరేట్‌ పౌరసత్వం, పారదర్శకత, కాలాతీతమైన విలువలతో కూడిన నమ్మకంతో నడుపబడుతున్న ఐటీసీ యొక్క బలమైన పాలనకు తగిన రీతిలో అందించిన ఈ గుర్తింపును స్వీకరించడం ఓ గౌరవంగా భావిస్తున్నాం. మా వరకూ మేము ఏర్పరుచుకున్న అత్యున్నత ప్రమాణాలకు మా ‘నేషన్‌ ఫస్ట్‌- సబ్‌ సాత్‌ బదేయిన్‌’ విశ్వసనీయత స్ఫూర్తి.
 
ఇది మా వాటాదారులకు అసాధారణ విలువను సృష్టించడంతో పాటుగా భారీ సామాజిక విలువను సృష్టించడానికి అర్ధవంతమైన సహకారం అందించడం జరుగుతుంది. అదే సమయంలో చురుకుదనం మరియు వినూత్న సామర్థ్యంతో మా వ్యాపారాల పోటీతత్త్వాన్నీ పెంచుతుంది. ఈ అవార్డును గౌరవనీయ మంత్రివర్యులు శ్రీ పియూష్‌ గోయల్‌ సమక్షంలో అందుకోవడం ఐటీసీ బృందానికి మరింత ప్రోత్సాహాన్ని అందిస్తుంది. మా వాటాదారులతో పాటుగా దేశానికి సైతం అత్యుత్తమ రేపటిని నిర్మించే   ప్రయాణంలో మరింత చురుగ్గా వారు పాల్గొనేందుకు అది స్ఫూర్తినందిస్తుంది’’ అని అన్నారు.
 
కార్పోరేట్‌ పరిపాలనలో శ్రేష్టత కోసం ఐసీఎస్‌ఐ జాతీయ అవార్డులు అనేవి అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డులు. కార్పోరేట్‌ పరిపాలనలో అత్యుత్తమ ప్రక్రియలను అమలు చేయడానికి గుర్తింపుగా ఈ అవార్డులు అందిస్తారు. ఐసీఎస్‌ఐ ఏర్పాటుచేసిన ఈ అవార్డులు, తమ కార్యకలాపాలలో చక్కటి కార్పోరేట్‌ పరిపాలనా మౌలిక సూత్రాలను జొప్పించడం ద్వారా చక్కటి కార్పోరేట్‌ పరిపాలనా సంస్కృతిని ప్రోత్సహించడంతో పాటుగా కార్పోరేట్‌ పరిపాలనలో సృజనాత్మక ప్రక్రియలు, కార్యక్రమాలు, ప్రాజెక్ట్‌లను సైతం తీసుకువచ్చే వ్యక్తులతో పాటుగా లిస్టెడ్‌ కంపెనీలను గుర్తించి, ప్రోత్సహిస్తాయి. అవార్డుల కోసం పోటీపడే వ్యక్తులు, సంస్థలను పరిపాలనా ఆకృతి, పారదర్శకత, ప్రమాణాల వెల్లడి తదితర అంశాల ఆధారంగా పరిశీలిస్తారు. రెండు దశాబ్దాల క్రితమే కార్పోరేట్‌ పరిపాలనను అధికార వ్యవస్ధలోకి అమలులోనికి తీసుకువచ్చిన భారతదేశంలోని మొట్టమొదటి సంస్థలలో ఐటీసీ ఒకటి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సిఎం జగన్ ఏమిటీ అన్యాయం? టీకా మాది.. ప్రచారం మీదా.. మోడీ ఫోటో ఎక్కడ?