తెలంగాణా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తోన్న ప్రీమియం డెయిరీ బ్రాండ్, సిద్స్ ఫార్మ్ తమ క్వాలిటీ పోర్టల్‌ను ప్రారంభించింది. భారతీయ పాల పరిశ్రమలో మొట్టమొదటిసారి ఇది.
సంపూర్ణమైన, పరిశుభ్రమైన, సురక్షితమైన పాలు మరియు పాల ఉత్పత్తులను వినియోగదారులకు అందించడంలో ఆహార భద్రత, నాణ్యత అనేవి అత్యంత కీలకాంశాలు. ఈ పోర్టల్‌తో వినియోగదారులు సంబంధిత సమాచారం తెలుసుకోగలరు.
వినియోగదారులు తాము కొనుగోలు చేసిన ఉత్పత్తులపై క్యుఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా ఆ తేదీకి సంబంధించి నిర్ధిష్టమైన బ్యాచ్ ఫలితాలు పొందవచ్చు. ఈ పోర్టల్ ఆవిష్కరణ గురించి సిద్స్ ఫార్మ్ ఫౌండర్- ఎండీ డాక్టర్ కిశోర్ ఇందుకూరి మాట్లాడుతూ, మేమిక్కడ ప్రారంభించాము. తాము ప్రతి రోజూ వినియోగిస్తున్న పాలు సురక్షితమైనవేనా కాదా అని వినియోగదారులు తెలుసుకోగలరు. సిద్స్ ఫార్మ్ వద్ద మేము ఎల్లప్పుడూ వినియోగదారులకు అత్యుత్తమ నాణ్యత కలిగిన ఉత్పత్తులను అందించడానికి కృషి చేస్తుంటాము. అసలైన ఫలితాలను వారితో పంచుకోవడానికి మేము ఎప్పుడూ సిగ్గుపడము అని అన్నారు.
ఈ నూతనంగా విడుదల చేసిన పోర్టల్‌లో 15 కీలకమైన ఫలితాలు ప్రదర్శిస్తారు, ఈ15 పరీక్షలు అత్యంత కీలకమైనవి. ఈ పరీక్షల ద్వారా విష రసాయనాలు, కల్తీ, యాంటీబయాటిక్స్, డిటర్జెంట్, హైడ్రోజన్ పెరాక్సైడ్, సోప్, సాల్ట్, స్టార్చ్, ఆల్కహాల్ పరీక్షలు చేస్తారు.