Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రచన బహదూర్‌ను సీనియర్ వైస్ ప్రెసిడెంట్, కంట్రీ హెడ్ ఇండియాగా ప్రకటించిన సింక్రోనీ

Rachana

ఐవీఆర్

, బుధవారం, 8 మే 2024 (21:26 IST)
సీనియర్ వైస్ ప్రెసిడెంట్, కంట్రీ హెడ్ ఇండియాగా రచనా బహదూర్‌ను నియమించినట్లు సింక్రోనీ వెల్లడించింది. ఫైనాన్షియల్ సర్వీసెస్- బ్యాంకింగ్ పరిశ్రమలో 30 ఏళ్ళకు పైగా స్ఫూర్తిదాయక కెరీర్‌తో, సింక్రోనీలో తన కొత్త భాద్యతలకు అనుభవాన్ని, నాయకత్వాన్ని రచన తీసుకువచ్చారు. రచన బహదూర్ గోల్డ్‌మన్ సాక్స్, జెపి మోర్గాన్ చేజ్, మోర్గాన్ స్టాన్లీతో సహా ప్రపంచంలోని కొన్ని ప్రముఖ ఆర్థిక సంస్థలలో ముఖ్యమైన పదవులను నిర్వహించారు. ప్రోడక్ట్, రిస్క్ మేనేజ్‌మెంట్, కంట్రోలర్‌షిప్, ఆపరేషన్స్ ఫంక్షన్‌లు అలాగే అనేక భారీ-స్థాయి సాంకేతిక పునరుద్ధరణలకు నాయకత్వం వహించడం వంటి అంశాలపై రచన దృష్టి సారించారు. ఆమె గత 18 సంవత్సరాలుగా యుఎస్, ఆసియా మరియు యూరప్‌లోని విభిన్న ప్రాంతాలలో వివిధ సీనియర్ గ్లోబల్ లీడర్‌షిప్ స్థానాలను నిర్వహించారు.
 
సింక్రోనీలో చేరడానికి ముందు, ఆమె గోల్డ్‌మన్ సాచ్స్‌లో మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు, అక్కడ ఆమె భారతదేశ వ్యాప్త  కార్యకలాపాలకు సహ-నాయకత్వం వహించటంతో పాటుగా ఇండియా అసెట్ అండ్ వెల్త్ మేనేజ్‌మెంట్ విభాగానికి నాయకత్వం వహించారు. సింక్రోనీ యొక్క మొత్తం భారతదేశ కార్యకలాపాలను నడిపించడానికి, నిర్వహించడానికి రచన బాధ్యత వహిస్తారు. ప్రాసెస్ ఎక్సలెన్స్, యాజమాన్యం, ఆలోచనాత్మక పరివర్తనను నడపడం, సహకార సంస్కృతిని పెంపొందించడం ద్వారా సింక్రోనీ ఇండియాను మార్చడానికి వ్యూహాత్మక ప్రణాళికను అభివృద్ధి చేయడం, అమలు చేయడం ఆమె బాధ్యత. ఆమె నియామకం గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌లో శ్రేష్ఠత, ఆవిష్కరణలకు సింక్రోనీ యొక్క నిబద్ధతను ప్రతిబింబిస్తుంది.
 
సమ్మిళితత, వైవిధ్యం కోసం రచన కృషి చేస్తుంటారు, ఇది ఒక సహాయక, విభిన్నమైన కార్యాలయాన్ని సృష్టించడానికి సింక్రోనీ యొక్క లక్ష్యంతో సమలేఖనం చేసే విలువ. ఆమె న్యూయార్క్‌లోని బరూచ్ కాలేజీ నుండి BBA చేశారు. ఆమె సర్టిఫైడ్ పబ్లిక్ అకౌంటెంట్. "మా నాయకత్వ బృందానికి రచన బహదూర్‌ను స్వాగతిస్తున్నందుకు మేము థ్రిల్‌గా ఉన్నాము" అని హ్యూమన్ రిసోర్సెస్-ఆసియా ఎస్ విపి గౌరవ్ సెహగల్ అన్నారు. "మేము మా సేవలను మెరుగుపరచడం, మా పరిధిని విస్తరింపజేయడం కొనసాగిస్తున్నందున, వ్యూహాత్మక నాయకత్వం, వివిధ గ్లోబల్ మార్కెట్లలో కార్యాచరణ నైపుణ్యానికి నిబద్ధత యొక్క ఆమె నిరూపితమైన ట్రాక్ రికార్డ్ అమూల్యమైనది" అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

యూపీఐ లావాదేవీల్లో వెనకబడిన పేటీఎం.. కారణం ఇదే..?