Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సింక్రోనీ ప్రతిష్టాత్మక కార్యక్రమం: తెలంగాణలోని 555 మంది వెటరన్స్‌కు ఆరోగ్య పరీక్షలు

image
, సోమవారం, 25 సెప్టెంబరు 2023 (19:24 IST)
ప్రీమియర్ కన్స్యూమర్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ, సింక్రోనీ, తెలంగాణాలోని సైనిక సంక్షేమ శాఖతో చేతులు కలిపి, స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని మాజీ సైనికుల కోసం ప్రత్యేక హెల్త్ చెకప్ డ్రైవ్‌ను నిర్వహించింది. ఆగస్టు 16 నుండి ఆగస్టు 31, 2023 వరకు రాష్ట్రవ్యాప్తంగా విజయ డయాగ్నోస్టిక్‌కు చెందిన 7 కేంద్రాలలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 555 మంది వెటరన్స్, వారి జీవిత భాగస్వాములకు అవసరమైన ఆరోగ్య పరీక్షలను నిర్వహించారు. ఈ డ్రైవ్‌ను తెలంగాణ ప్రభుత్వ సైనిక సంక్షేమ శాఖ డైరెక్టర్ కల్నల్ పి రమేష్ కుమార్ (రిటైర్డ్) ప్రారంభించారు.
 
సింక్రోనీ వెటరన్స్ నెట్వర్క్, దాని NGO భాగస్వామి ASSIST మరియు సైనిక్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్‌తో కలిసి, తెలంగాణలోని విజయ డయాగ్నోస్టిక్‌కు చెందిన షాద్‌నగర్, మంచిర్యాల్, సంగారెడ్డి, వరంగల్, హన్మకొండ, బద్వేల్, కిస్మత్‌పూర్ కేంద్రాలతో సహా వివిధ ప్రదేశాలలో ఆరోగ్య పరీక్షలను స్పాన్సర్ చేసింది. ఈ కార్యక్రమం ద్వారా మాజీ సైనికులు, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్యం మరియు సంక్షేమం గురించి అవగాహన పెంచడం లక్ష్యంగా చేసుకున్నారు.
 
ఈ కార్యక్రమం గురించి వైస్ ప్రెసిడెంట్ హ్యూమన్ రిసోర్సెస్ ఆసియా డైవర్సిటీ & రిక్రూట్‌మెంట్ COE లీడర్ కామేశ్వరి గంగాధరభట్ల మాట్లాడుతూ, “ఈ ఉదాత్తమైన కార్యక్రమం కోసం సైనిక సంక్షేమ శాఖతో భాగస్వామ్యం చేసుకోవటం పట్ల మేము చాలా సంతోషంగా వున్నాము. ఈ హెల్త్ చెకప్ డ్రైవ్ మా వెటరన్స్, వారి కుటుంబాల పట్ల సింక్రోనీ యొక్క తిరుగులేని నిబద్ధతను నొక్కి చెబుతుంది. ఈ తరహా భాగస్వామ్యాల ద్వారా, వెటరన్స్ జీవితాలపై అర్ధవంతమైన ప్రభావాన్ని చూపాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాము. వారు న్యాయబద్ధంగా అర్హత కలిగిన సంరక్షణ, శ్రద్ధను దీని ద్వారా పొందుతారు. ఈ ప్రయత్నం కమ్యూనిటీ ఔట్రీచ్ పట్ల మా నిబద్ధతను, మన దేశానికి సేవ చేయడానికి నిస్వార్థంగా తమను తాము అంకితం చేసుకున్న వీరులకు మా మద్దతును వెల్లడిస్తుంది"అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇష్టపడే ఆన్‌లైన్ బ్రాండ్‌గా అమెజాన్