Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఇష్టపడే ఆన్‌లైన్ బ్రాండ్‌గా అమెజాన్

Amazon
, సోమవారం, 25 సెప్టెంబరు 2023 (17:14 IST)
భారతదేశ వ్యాప్తంగా ఉన్న వినియోగదారులు ఈ పండుగ సీజన్‌లో ఆన్‌లైన్‌లో షాపింగ్ చేయడానికి గతంలో కంటే ఉత్సాహంగా, మరియు గతంలో ఎప్పుడూ లేని ఆసక్తితో ఉన్నారని నీల్సన్ మీడియా ఇండియా స్వతంత్ర అధ్యయనం పేర్కొంది. అమెజాన్ ఇండియా తరఫున ఈ సంస్థ ఈ అధ్యయనం నిర్వహించింది. 81% మంది ఈ విషయంలో బలమైన సెంటిమెంట్ మరియు ఉద్దేశ్యం వ్యక్తం చేశారు; 78% మంది ఆన్‌లైన్ షాపింగ్‌ను విశ్వసించారు మరియు గత పండుగ సీజన్‌తో పోలిస్తే ఈ పండుగ సీజన్‌లో ఆన్‌లైన్ కొనుగోళ్ల మీద వ్యయం పెంచాలని 2 మందిలో ఒకరు భావిస్తున్నారు.

ఈ క్రమంలో, విస్తృతమైన ఎంపికలు, పోటీ ధరలతో పాటు సాటిలేని విలువ, సులభమైన సౌలభ్యం మరియు ఎక్స్ఛేంజ్ సౌకర్యం అందించే ఆన్‌లైన్ షాపింగ్ అనుభవం కోసం వినియోగదారులు ఆశిస్తున్నారు. 68% మంది వినియోగదారుల దృష్టిలో వారు ఎంచుకునే మరియు వారికి అనుకూలమైన ఆన్‌లైన్ షాపింగ్ గమ్యస్థానంగా అమెజాన్ ఉందని ఈ అధ్యయనం వెల్లడించింది మరియు దాదాపు సగం మంది వారి పండుగ షాపింగ్ కోసం అమెజాన్‌ని అత్యంత విశ్వసనీయమైన మరియు గొప్పగా ఇష్టపడే ఆన్‌లైన్ బ్రాండ్‌గా పేర్కొన్నారు; అమెజాన్లో విస్తృతమైన ఉత్పత్తుల ఎంపికతో పాటు బ్రాండ్లు ఉన్నట్లు 75% వినియోగదారులు పేర్కొన్నారు. 
 
ఈ విషయమై అమెజాన్ ఇండియా కంట్రీ మేనేజర్ ఇండియా కన్స్యూమర్ బిజినెస్ మనీష్ తివారీ మాట్లాడుతూ, "పండుగ కాలం అనేది భారతదేశంలోని వినియోగదారులకు మరియు విక్రేతలకు ఇష్టమైన సమయం. ఈ సంవత్సరం వినియోగదారులు చాలా ఉత్సాహంతో ఉన్నారని మరియు ఆన్‌లైన్‌లో షాపింగ్ కోసం ఎక్కువ ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలుసుకోవడం మాలో ప్రేరణ కలిగించింది. భారతదేశం వ్యాప్తంగా ఉన్న వినియోగదారులు Amazon.inని అత్యంత విశ్వసనీయమైన, ప్రాధాన్యమిచ్చే మరియు ఇష్టపడే ఆన్‌లైన్ షాపింగ్ గమ్యస్థానంగా గుర్తించారని తెలిసి మేము సంతోషిస్తున్నాము. ఒక మార్కెట్‌ప్లేస్‌గా, మా అమ్మకందారులు మరియు కస్టమర్ల కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాము మరియు 'అమెజాన్ గ్రేట్ ఇండియా ఫెస్టివల్ 2023' ఒక నిరంతరాయ షాపింగ్ అనుభవం, అత్యద్భుతమైన విలువ, దేశీయ మరియు అంతర్జాతీయ బ్రాండ్లు మరియు ఉత్పత్తులకు సంబంధించి విస్తృతమైన ఎంపికలు అందించడంతో పాటు భారతదేశం వ్యాప్తంగా ఉన్న వినియోగదారులకు సాటిలేని సౌలభ్యం అందిస్తుందని మేము విశ్వసిస్తున్నాము" అని అన్నారు.
 
ఆన్‌లైన్ పండుగ షాపింగ్‌ మీద  భారతీయ వినియోగదారుల మమకారం
మెట్రో నగరాల్లో 87% మంది మరియు టైర్-2 నగరాల్లో (10-40 లక్షల జనాభా కలిగినవి) 86% మంది వినియోగదారులు ఈ పండుగ కాలంలో ఆన్‌లైన్‌లో షాపింగ్‌ను ఎంచుకోబోతున్నారని ఈ అధ్యయనం వెళ్లడించింది. ఆన్‌లైన్ పండుగ షాపింగ్ ఈవెంట్‌లు వేగవంతమైన డెలివరీ లాంటి ఎంపికలతో తమ ఆన్‌లైన్ షాపింగ్ అనుభవం సౌలభ్యాన్ని పెంచుతాయని 77% మందికి పైగా వినియోగదారులు ధృవీకరించారు.  ఆన్‌లైన్ పండుగ షాపింగ్ ఈవెంట్లలో ఎలక్ట్రానిక్ వస్తువులు - ఆకర్షణీయమైన ఆఫర్లు (76%) మరియు కొత్త బ్రాండ్ల ఆవిష్కరణలు (75%) లాంటి ప్రత్యేకతలతో లభిస్తాయి కాబట్టి, ఆసమయంలో వాటిని కొనుగోలు చేయడం కోసం 70% కంటే ఎక్కువ మంది వినియోగదారులు నిరీక్షిస్తున్నారు  75% పైగా వినియోగదారులు వారి కొనుగోలు మరింత సౌకర్యవంతంగా మరియు రివార్డ్ అందించేదిగా ఉండడం కోసం ఆకర్షణీయమైన బ్యాంక్ ఆఫర్లు మరియు నో-కాస్ట్ EMIలు లాంటి వాటికోసం ఆతృతగా చూస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన పరిణీతి చోప్రా రాఘవ్ చద్దా