Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

స్థానిక భాషలో యూజర్లకు చేరువయ్యేందుకు కూలో చేరిన స్నాప్‌డీల్

Advertiesment
Snapdeal
, బుధవారం, 1 డిశెంబరు 2021 (20:01 IST)
ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అయిన స్నాప్‌డీల్, భారత్‌లోని మిలియన్ల మంది యూజర్లతో వారి స్థానిక భాషలో కనెక్ట్ అవ్వడానికి మేడ్-ఇన్-ఇండియా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్- కూ(Koo)లో ప్రొఫైల్ క్రియేట్ చేసుకుంది.

 
భారతదేశంలోని చిన్న నగరాలు మరియు పట్టణాల నుండి పెరుగుతున్న అవగాహన ద్వారా ఇ-కామర్స్  ల్యాండ్‌స్కేప్ పునర్నిర్మించబడుతుంది. కస్టమర్ల ప్రత్యేక అవసరాలు, స్థానిక భాషా కంటెంట్ మరియు సమాచారం కోసం డిమాండ్‌తో పాటు, సెక్టర్ యొక్క వేగవంతమైన వృద్ధికి ఆజ్యం పోసింది.

 
స్నాప్ డీల్ భారతదేశం అంతటా, ప్రత్యేకించి టైర్ 2 మరియు టైర్ 3 పట్టణాల్లోని వినియోగదారులతో వారి మాతృభాషలో విక్రయాలు, డీల్‌లు మరియు ఆఫర్‌ల గురించి సంబంధిత నవీకరణలు షేర్ చేసుకోడానికి కూ(Koo) యాప్ యొక్క వినూత్నమైన బహుళ-భాషా ఫీచర్లను ఉపయోగించుకోనుంది.

 
స్థానిక భాషలలో స్వీయ-వ్యక్తీకరణ కోసం కూ యాప్ హిందీ, బెంగాలీ, అస్సామీ, తెలుగు, తమిళం, కన్నడ, మరాఠీ, గుజరాతీ మరియు ఇంగ్లీష్-తొమ్మిది భాషలలో దాని సేవలను అందిస్తుంది. 15 మిలియన్లకు పైగా ఉన్న ప్రస్తుత యూజర్ బేస్ నుండి, వేగంగా అభివృద్ధి చెందుతున్న మైక్రో-బ్లాగింగ్ ప్లాట్‌ఫారం వచ్చే ఏడాదిలో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లను చేరుకోగలదని భావిస్తున్నారు.

 
కూ యాప్‌లో అకౌంట్ ను సెటప్ చేయడం ద్వారా స్నాప్‌డీల్ డిజిటల్ ఫస్ట్ ఎకానమీలో తమ మాతృభాషలో బ్రాండ్‌లతో నిమగ్నమవ్వాలనుకునే ఇంటర్నెట్ యూజర్ల యొక్క విభిన్న జనాభాను మరింత చేరుకోగలుగుతుంది. స్నాప్‌డీల్ బ్రాండ్ మార్కెటింగ్ డైరెక్టర్ సౌమ్యదీప్ ఛటర్జీ మాట్లాడుతూ “మొబైల్ ఇంటర్నెట్ యాక్సెస్ రిమోట్ లొకేషన్‌లలో నివసించే వారిని చేరుకోవడం మరియు వారితో స్థానిక భాషల్లో కమ్యూనికేట్ చేయడం సాధ్యమైంది. అందువల్ల బహుభాషా కంటెంట్‌ను రూపొందించడంలో సమయాన్ని కేటాయించడం చాలా కీలకం. కూ వంటి ప్లాట్‌ఫారం స్థానిక కమ్యూనిటీలను మంచి స్థాయిలో నిర్మించడంలో మాకు సహాయపడుతుంది.

 
స్నాప్‌డీల్‌ను ప్లాట్‌ఫారం లోకి స్వాగతిస్తూ కూ యొక్క సహ వ్యవస్థాపకుడు మయాంక్ బిదవత్కా మాట్లాడుతూ “మా ప్లాట్‌ఫారం లో స్నాప్‌డీల్ వంటి అతిపెద్ద మరియు అత్యంత ప్రజాదరణ పొందిన ఇ-కామర్స్ దిగ్గజాలలో ఒకదానిని కలిగి ఉన్నందుకు మేము సంతోషిస్తున్నాము. కూ యాప్ భారతీయులు తమ మాతృభాషలో తమ భావాలను వ్యక్తీకరించడానికి తోడ్పడుతుంది. మా స్మార్ట్ ఫీచర్‌లు ఆటో అనువాదాలను అందిస్తాయి. భాషా అడ్డంకులను విచ్ఛిన్నం చేస్తూ యూజర్లు ఒకరితో ఒకరు కనెక్ట్ అయ్యేలా ప్రోత్సహిస్తాయి. మా ఫీచర్‌లను సద్వినియోగం చేసుకోవడం ద్వారా స్నాప్‌డీల్ విస్తారమైన యూజర్ బేస్‌తో విజయవంతంగా కనెక్ట్ అవ్వగలదని మరియు బహుళ భాషల్లో వారి ఆఫర్‌లపై ఎక్కువ సంభాషణలను ప్రమోట్ చేయగలదని మేము విశ్వసిస్తున్నామన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సీనియర్ సిటిజన్ల కోసం జాతీయ హెల్ప్‌లైన్ నంబర్, తొలుత 2017లో తెలంగాణ నుంచే...