Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇన్‌పుట్‌ వ్యయం పెరగడం చేత తమ పాల ధరను ప్యాకెట్‌కు రెండు రూపాయలు పెంచిన సిద్స్‌ ఫార్మ్‌

Advertiesment
milk
, శుక్రవారం, 3 ఫిబ్రవరి 2023 (18:47 IST)
తెలంగాణా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రీమియం డీ2సీ డెయిరీ బ్రాండ్‌, సిద్స్‌ ఫార్మ్‌ తమ ఏ2గేదె పాలు, స్కిమ్‌ మిల్క్‌ మరియు ఏ2 డబుల్‌ టోన్డ్‌ గేదె పాల ధరను ప్యాకెట్‌కు 2 రూపాయలు పెంచుతున్నట్లు వెల్లడించింది. ఈ సవరించిన ధరలతో 500 మిల్లీ లీటర్ల ఏ2 గేదె పాల ప్యాకెట్‌ ధర 52 రూపాయలు కాగా, స్కిమ్‌ పాల ధర 32 రూపాయలుగా ఉంటుంది.


ఏ2 డబుల్‌ టోన్డ్‌ గేదె పాల ధర 42 రూపాయలుగా ఉంటుంది. అయితే ఏ2 దేశీ ఆవు పాల ధర మాత్రం గతంలో ఉన్నట్లుగానే అర లీటరుకు 75 రూపాయలుగా ఉంటుంది. గత కొన్ని నెలలుగా ముడిపాలు ధరలు స్ధిరంగా పెరుగుతుండటం చేత దాదాపు ప్రతి డెయిరీ బ్రాండ్‌ తమ పాల ధరలను సవరిస్తున్నాయి.

 
సిద్స్‌ ఫార్మ్‌ ఫౌండర్‌ డాక్టర్‌ కిశోర్‌ ఇందుకూరి మాట్లాడుతూ, ‘‘మా వినియోగదారులకు అత్యున్నత నాణ్యత కలిగిన పాల ఉత్పత్తులను అందిస్తుండటం పట్ల సిద్స్‌ ఫార్మ్‌ వద్ద మేము చాలా గర్వంగా ఉన్నాము. పాలు, పన్నీర్‌, నెయ్యి, పాలు, వెన్న సరఫరాదారునిగా అందుబాటు ధరలలో అత్యుత్తమ ఉత్పత్తులను అందించేందుకు ప్రయత్నిస్తున్నాము. దురదృష్టవశాత్తు, కొరత కారణంగా పెరిగిన ముడిపాల ధరలతో తప్పనిసరిగా ప్యాకెట్‌కు 2 రూపాయలు పెంచాల్సి వస్తుంది. వినియోగదారులకు కాస్త భారం అయినప్పటికీ అత్యున్నత ప్రమాణాలను నిర్వహించేందుకు, పెరుగుతున్న అవసరాలను తీర్చేందుకు తప్పనిసరి’’అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రపంచంలో అత్యధికంగా సబ్‌స్ర్కైబ్‌ చేయబడిన యూట్యూబ్‌ ఛానెల్‌గా ఆజ్‌తక్‌: అభినందించిన సీఈఓ సుపాన్‌