పారిశ్రామికవేత్త, మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో చురుకుగా వుంటారు. తరచుగా వైరల్ అయ్యే వీడియోలను ఆయన షేర్ చేస్తుంటారు. తాజాగా ట్విట్టర్‌లో ఆయన పోస్టు చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ వీడియోలో, ఒక రెస్టారెంట్‌లోని వెయిటర్ అద్భుతమైన ప్లేట్-స్టాకింగ్ నైపుణ్యాలను ప్రదర్శిస్తూ కనిపించాడు. ఒక వ్యక్తి పెద్ద గ్రిడ్‌పై దోసెలను తయారు చేసి, వాటిని వేరు వేరు ప్లేట్లలో ఉంచడంతో వీడియో ప్రారంభం అవుతుంది.
వెయిటర్ తర్వాత లోపలికి వచ్చి ప్లేట్‌లను ఒకవైపు పేర్చడం మొదలుపెడతాడు, చివరికి 16 ప్లేట్‌లను ఒకేసారి బ్యాలెన్స్ చేసి కస్టమర్ ఏరియాకి వెళ్లి వాటిని అందించాడు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇప్పటివరకు 3 మిలియన్ల వీక్షణలు, 42k లైక్‌లను సంపాదించుకుంది.