రైలు టిక్కెట్ల బుకింగ్స్‌పై సేవా రుసుం మినహాయింపు పొడిగింపు
గత యేడాది దేశంలో పెద్ద నోట్ల రద్దు తర్వాత 2016 నవంబర్‌లో ఆన్‌లైన్ రైల్వే టికెట్లపై సేవా రుసుమును కేంద్రం రద్దు చేసింది. నగదు రహిత లావాదేవీల ప్రోత్సహించాలనే ఉద్దేశంతో సేవా రుసుమును ఎత్తివేశారు.
గత యేడాది దేశంలో పెద్ద నోట్ల రద్దు తర్వాత 2016 నవంబర్‌లో ఆన్‌లైన్ రైల్వే టికెట్లపై సేవా రుసుమును కేంద్రం రద్దు చేసింది. నగదు రహిత లావాదేవీల ప్రోత్సహించాలనే ఉద్దేశంతో సేవా రుసుమును ఎత్తివేశారు. తాజాగా దీన్ని వచ్చే ఏడాది మార్చి వరకు సేవా రుసుం లేకుండానే టికెట్ బుక్ చేసుకునే సౌలభ్యం కల్పించారు. వచ్చే ఏడాది మార్చి 2018 వరకు సేవా రుసుము లేకుండానే టికెట్లను బుక్ చేసుకోవచ్చు.
సేవా రుసుము వల్ల టికెట్‌పై రూ.20 నుంచి, రూ.40 మేర వినియోగదారులకు లబ్ధి చేకూరుతోంది. ఐఆర్‌సీటీసీకి వచ్చే ఆదాయం 33 శాతం సేవా రుసుముల నుంచే వస్తోంది. గతేడాది ఐఆర్‌సీటీసీకి వచ్చిన మొత్తం ఆదాయంలో కేవలం సేవా రుసుము ద్వారానే రూ.540 కోట్లు రావడం గమనార్హం. ఈ సేవా రుసుం రద్దు తర్వాత రూ.184 కోట్ల మేర ఐఆర్‌సీటీసీకి ఆదాయం తగ్గింది.