లాక్ డౌన్ కారణంగా ఎమర్జెన్సీ లోన్ స్కీమ్ పేరుతో స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా(ఎస్‌బీఐ) సరికొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ స్కీమ్ ద్వారా ఖాతాదారులు కేవలం 45 నిమిషాల్లోనే రూ.5 లక్షల వరకు బ్యాంకు నుంచి లోన్ పొందవచ్చు. ఈ స్కీమ్ ద్వారా తీసుకున్న రుణ మొత్తంపై 10.5 శాతం వడ్డీరేటు వర్తిస్తుంది.
అంతేగాకుండా.. నెలసరి చెల్లింపులు కూడా ఆరునెలల తర్వాత ప్రారంభమవుతాయి. లోన్ తీసుకున్న ఆరు నెలల తర్వాత మొదటి ఈఎంఐ కట్టాల్సి ఉంటుంది. ఈ స్కీమ్ ద్వారా రుణం పొందేందుకు ఎస్‌బీఐ యోనో యాప్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. లాక్ డౌన్ కొనసాగుతుండటంతో ఈ విధానం ఖాతాదారులకు ఎంతో వెసులుబాటు కలిగిస్తుందని ఎస్‌బీఐ పేర్కొంది.