Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Wednesday, 2 April 2025
webdunia

వేలాది బ్యాంకు ఖాతాలను నిలిపివేసిన ఎస్.బి.ఐ

Advertiesment
sbi bank
, శుక్రవారం, 8 జులై 2022 (10:12 IST)
దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాకింగ్ సంస్థగా ఉన్న భారతీయ స్టేట్ బ్యాంకు వేలాది బ్యాంకు ఖాతాల లావాదేవీలను నిలిపివేసింది. దీంతో ఖాతాదారులు గగ్గోలు పెడుతున్నారు. అయితే, ఖాతాలను స్తంభింపజేయడానికి ప్రధాన కారణంగా ఖాతాదారులు కేవైసీ అప్‌డేట్ చేయలేదని ఎస్.బి.ఐ అధికారులు వివరణ ఇచ్చారు. 
 
బ్యాంకు సేవలు నిరంతరాయంగా కొనసాగించేందుకు భారత రిజర్వు బ్యాంకు నిబంధనల మేరకు బ్యాకు ఖాతాదారులు తమ కేవైసీని క్రమానుగతంగా అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. పాస్‌పోర్ట్, ఓటర్ ఐడీ ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్‌కార్డును చిరునామా ధృవీకరణకు సమర్పించవచ్చు. ఈ పని చేయకపోవడం వల్లే వేలాది మంది వినియోగదారుల ఖాతాల లావాదేవీలను నిలిపివేసింది. 
 
మరోవైపు, కేవైసీ అప్‌డేషన్‌కు సంబంధించి నిర్ధిష్ట ఫార్మెట్‌తో కూడిన ఫారంపై సంతకం చేసి కస్టమర్ ఆ పత్రాన్ని బ్యాంకులో సమర్పించాల్సివుంటుంది. లేదా ఈమెయిల్ ద్వారా లేదా పోస్టు ద్వారా బ్యాంకుకు పంపించాల్సివుంటుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వైఎస్సార్ జయంతి నేడు: ఇడుపులపాయకు కుటుంబ సభ్యులు