గ్లోబల్ బ్రాండ్ కన్సల్టెన్సీ ఇంటర్‌బ్రాండ్ ప్రకటించిన బెస్ట్ గ్లోబల్ బ్రాండ్స్ జాబితాలో తమకు 5వ ర్యాంక్ లభించినట్లు శాంసంగ్ నేడు వెల్లడించింది. వరుసగా ఆరో ఏడాది కూడా ఇదే స్థానాన్ని నిలబెట్టుకోవడం గమనార్హం. ఈ సంవత్సరం జాబితాలో, శాంసంగ్ $ 90.5 బిలియన్ల బ్రాండ్ విలువను నమోదు చేసింది. 2020 నుండి ప్రపంచ టాప్-5లో స్థానం నిలబెట్టుకున్న ఏకైక ఆసియా కంపెనీగా శాంసంగ్ తన స్థానాన్ని పదిలం చేసుకుంది. ఇంటర్‌బ్రాండ్ ప్రకారం, శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ యొక్క సానుకూల మూల్యాంకనానికి ఈ క్రింది అంశాలు దోహదపడ్డాయి.
కంపెనీ యొక్క అన్ని వ్యాపార విభాగాలలో AI పోటీతత్వాన్ని బలోపేతం చేసుకోవడం.
ఉత్పత్తుల మధ్య ఏకీకరణ ద్వారా వినియోగదారుల అనుభవాన్ని మెరుగుపరచడం.
AI-సంబంధిత సెమీకండక్టర్లపై ప్రత్యేకంగా పెట్టుబడులు పెట్టడం.
వినియోగదారు-కేంద్రీకృత బ్రాండ్ వ్యూహాన్ని అమలు చేయడం.
AI ఆవిష్కరణలు, ఓపెన్ సహకారం ద్వారా, శాంసంగ్ తమ రోజువారీ జీవితంలో AIని మరింత మంది వినియోగదారులు అనుభవించేలా కృషి చేసింది, అని శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ ప్రెసిడెంట్- గ్లోబల్ మార్కెటింగ్ ఆఫీస్ హెడ్, వోన్-జిన్ లీఅన్నారు. భవిష్యత్తులో, ఆరోగ్యం, భద్రతతో సహా వినియోగదారుల ప్రయోజనాలపై మా దృష్టిని కొనసాగిస్తాం, తద్వారా శాంసంగ్ మరింత ఆదరణ పొందిన బ్రాండ్‌గా ఎదుగుతుంది అని ఆయన అన్నారు.
అందరి కోసం ఆవిష్కరణ అనే దార్శనికతతో, శాంసంగ్ ప్రపంచవ్యాప్తంగా AIని మరింత మంది వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావడానికి నిరంతరం ప్రయత్నిస్తోంది. ఈ సంవత్సరం, శాంసంగ్ గెలాక్సీ AIని నిరంతరం అభివృద్ధి చేస్తూ, మొబైల్ AIలో తన నాయకత్వాన్ని బలోపేతం చేసుకుంది. ఈ ఏడాదిలోనే 400 మిలియన్ల డివైజ్‌లలో గెలాక్సీ AIని అందుబాటులోకి తీసుకురావడం ద్వారా AI ప్రజాస్వామ్యీకరణను నడిపించాలని లక్ష్యంగా పెట్టుకుంది. కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ (CE)లో, విజన్ AI, బెస్పోక్ AI వంటి ప్రతి ఉత్పత్తి వర్గానికి అనుగుణంగా AI టెక్నాలజీలను పరిచయం చేయడం ద్వారా శాంసంగ్ AI పోటీతత్వాన్ని విస్తరించింది.
వివిధ భాగస్వాములతో కలిసి పనిచేయడం ద్వారా, శాంసంగ్ వినియోగదారులకు మరింత వ్యక్తిగతమైన AI అనుభవాలను అందిస్తోంది. అదే సమయంలో, శాంసంగ్ నాక్స్ ద్వారా పరిశ్రమలోనే అత్యుత్తమ భద్రతను కూడా కల్పిస్తోంది. సెమీకండక్టర్ రంగంలో, క్లౌడ్, ఆన్-డివైస్, ఫిజికల్ AI విభాగాలలో విస్తృతమైన పోర్ట్‌ఫోలియోతో, పెరుగుతున్న AI డిమాండ్‌ను శాంసంగ్ అందుకుంటోంది. ఇందులో HBM, హై-కెపాసిటీ DDR5, LPDDR5X, GDDR7 వంటి అధునాతన ఉత్పత్తులను అందిస్తోంది.
AIకే పరిమితం కాకుండా, శాంసంగ్ తమ ఉత్పత్తులు, సేవలను మరింత అందుబాటులోకి తెస్తూ, అన్ని వ్యాపార విభాగాలలో సుస్థిర ఆవిష్కరణలను ప్రోత్సహిస్తోంది. స్మార్ట్‌థింగ్స్ ద్వారా కనెక్ట్ చేయబడిన ఇంధన-సామర్థ్యం గల ఉపకరణాలతో విద్యుత్‌ను ఆదా చేయడం కూడా ఇందులో భాగమే.