Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

‘వన్ రైడ్ 2022’ 11వ ఎడిషన్‌ను వేడుక ఆచరిస్తున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ గ్లోబల్ కమ్యూనిటీ

Advertiesment
ROYAL ENFIELD
, సోమవారం, 19 సెప్టెంబరు 2022 (22:55 IST)
బ్రాండ్ మోటార్‌సైక్లింగ్ స్ఫూర్తిని ఆచరించుకునే గ్లోబల్ మార్క్యూ రైడ్‌లో ‘వన్ రైడ్’ అనే నినాదంతో భాగంగా ఆదివారం, సెప్టెంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా ఉన్న నగరాల్లో నిర్వహించిన కార్యక్రమంలో ది రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిళ్ల శబ్దాలు ప్రతిధ్వనించాయి. మోటార్‌సైక్లింగ్, రాయల్ ఎన్‌ఫీల్డ్ పట్ల రైడర్‌లకు ఉన్న మక్కువను వేడుక చేసుకునే లక్ష్యంతో 2011లో ప్రవేశపెట్టబడిన ‘వన్ రైడ్’ ప్రపంచవ్యాప్తంగా 50 దేశాల్లో ఆచరించుకున్నారు. భారతదేశంలో, ‘వన్ రైడ్’ 11వ ఎడిషన్‌లో 500 నగరాల నుంచి 15,000 కన్నా, ఎక్కువ మంది రైడర్లు పాల్గొన్నారు. ఇందులో రాయల్ ఎన్‌ఫీల్డ్ ఔత్సాహికులు కలిసికట్టుగా రైడ్ చేసేందుకు, స్నేహం, సోదరభావాన్ని ఆచరించుకునేందుకు ఒక్కతాటిపైకి వచ్చారు.
 
‘వన్ రైడ్’ అనేది భారతదేశంలో అతిపెద్ద కాజ్ లెడ్ రైడ్ కాగా, ఇక్కడ విభిన్న ప్రాంతాలు, సామాజిక గుర్తింపుల నుంచి అన్ని వయసులకు చెందిన మోటార్‌సైక్లింగ్ ఔత్సాహికులు కలిసికట్టుగా మరియు అత్యంత ప్రత్యేకమైన రైడ్ కోసం కలిసి వచ్చారు. స్థానిక పర్యావరణ వ్యవస్థ, సముదాయపు సవాళ్లు, స్థానిక సముదాయంలో పునరుత్పత్తి లేదా పునరుద్ధరణ కోసం వారికి స్వచ్చందంగా/మద్దతిచ్చే అవకాశాలపై స్పందించే రైడర్‌లను మార్పు ఏజెంట్‌లుగా మార్చేందుకు ఈ రైడ్ ప్రోత్సహిస్తూ వస్తోంది. ఈ ఏడాది థీమ్ ‘వన్ వరల్డ్- వన్ మిషన్- వన్ రైడ్’ కాగా, రాయల్ ఎన్‌ఫీల్డ్ తన సామాజిక లక్ష్యం బాధ్యతాయుతమైన ప్రయాణ పద్ధతులను ప్రోత్సహించే దిశలో దీన్ని నిర్వహించింది.
 
ఈ ఏడాది ‘వన్ రైడ్’ రైడ్‌లో ఢిల్లీ, బెంగుళూరు, పుణె, చెన్నై, గోవా, ఇండోర్, గౌహతి, లెహ్ మరియు ఇతర 500 భారతీయ నగరాల నుంచి 15,000 కన్నా ఎక్కువ మంది రైడర్‌లు రికార్డు స్థాయిలో పాల్గొన్నారు. అర్జెంటీనా, కొలంబియా, స్పెయిన్, మెక్సికో, పెరూ, చిలీ, ఈక్వెడార్, ఫ్రాన్స్, ఉరుగ్వే, కోస్టారికా, ఇండోనేషియా, యునైటెడ్ కింగ్‌డమ్, ఆస్ట్రేలియా, కొరియా, జపాన్, సింగపూర్, స్పెయిన్‌, కంబోడియా, థాయిలాండ్, బ్రెజిల్, దుబాయ్, ఫ్రాన్స్, ఫిలిప్పీన్స్, ఇటలీ మరియు జర్మనీలతో సహా ప్రపంచవ్యాప్తంగా 50 దేశాలలో రాయల్ ఎన్‌ఫీల్డ్ ఒకే స్ఫూర్తితో వన్ రైడ్‌ని నిర్వహించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చీరకట్టులో ఫుట్‌బాల్ ఆడిన మహిళా ఎంపీ.. ఫోటోలు వైరల్