Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆర్‌ఎల్‌జీ ఇండియా క్లీన్‌ టు గ్రీన్‌ ఇ-వేస్ట్‌ సేకరణ కార్యక్రమం హైదరాబాద్‌లో ప్రారంభం

Advertiesment
ఆర్‌ఎల్‌జీ ఇండియా క్లీన్‌ టు గ్రీన్‌ ఇ-వేస్ట్‌ సేకరణ కార్యక్రమం హైదరాబాద్‌లో ప్రారంభం
, సోమవారం, 5 అక్టోబరు 2020 (17:00 IST)
ఎలక్ట్రానిక్స్ అండ్‌ ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వశాఖ మార్గనిర్దేశకత్వంలో, డిజిటల్‌ ఇండియా ఉద్యమానికి అనుగుణంగా ఆర్‌ఎల్‌జీ ఇండియా ఇప్పుడు క్లీన్‌ టు గ్రీన్‌ ప్రచారాన్ని ప్రారంభించింది. సురక్షితంగా మరియు బాధ్యతాయుతంగా ఎలక్ట్రానిక్ వ్యర్థాల(ఈ-వేస్ట్‌)ను నాశనం చేయడాన్ని ప్రోత్సహించే కార్యక్రమమిది.
 
ఈ ప్రచారం ద్వారా ఆర్‌ఎల్‌జీ ఇండియా ఇప్పుడు స్థిరమైన, ఆహ్లాదకరమైన పర్యావరణ నిర్మాణం పట్ల తమ నిబద్ధతను పునరుద్ఘాటించడంతో పాటుగా ఈ-వ్యర్ధాలు భూమిలోకి చేరకుండా అడ్డుకుని మన పర్యావరణ వ్యవస్థ విషతుల్యం కాకుండా కాపాడుతుంది.
 
ఈ క్లీన్‌ టు గ్రీన్‌ ప్రచారాన్ని ప్రారంభించిన శ్రీమతి రాధికా కాలియా, ఎండీ, ఆర్‌ఎల్‌జీ ఇండియా మాట్లాడుతూ, ‘‘ఈ కార్యక్రమం ద్వారా మేము అవాంఛిత ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను నాశనం చేయడంతో పాటుగా వాటిని రీసైకిల్‌ చేయడం ద్వారా పర్యావరణం కాపాడుతున్నాం. ఈ ఇ-వ్యర్ధాలను పలు సేకరణ కేంద్రాల వద్ద యజమానులు అందించడం లేదా అభ్యర్థించిన మీదట మా బృందాలు ఇంటి వద్దనే సేకరించడం చేస్తారు’’ అని అన్నారు.
 
2020-21 ఆర్థిక సంవత్సరంలో క్లీన్‌ టు గ్రీన్‌ క్యాంపెయిన్‌ తమ సేకరణ కార్యక్రమాన్ని ఢిల్లీ, ఎన్‌సీటీ, బెంగళూరు, ముంబై, హైదరాబాద్‌లలో ప్రారంభించనుంది. ఈ కార్యక్రమం తొలిసారిగా జూలై 15వ తేదీన నోయిడాలో ప్రారంభమైంది. అనంతరం సెప్టెంబర్‌ 24వ తేదీన గురుగ్రామ్‌లో ప్రారంభమైతే నేడు హైదరాబాద్‌లో జగదీష్‌ మార్కెట్‌ అనుసరించి సీటీసీ వద్ద ప్రారంభమైంది.
 
నోయిడా, గురుగ్రామ్‌ వద్ద సాధించిన అపూర్వ విజయ స్ఫూర్తితో అదే తరహా కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో కూడా అనుసరిస్తున్నామని కాలియా అన్నారు. దీనిలో భాగంగా క్లీన్‌ టు గ్రీన్‌ చాంఫియన్స్‌ బృందాలు వాహనంలో ఇ-వ్యర్ధాలను సేకరించడం చేస్తారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సోషల్ మీడియాకు బానిస కాని అమ్మాయి కావాలి..