Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నవంబర్ 29న మార్కెట్లోకి Renault Duster SUV

Renault Duster SUV
, శుక్రవారం, 27 అక్టోబరు 2023 (18:35 IST)
Renault Duster SUV
‘రెనాల్ట్ డస్టర్’.. భారతీయులకు చాలా ప్రత్యేకం. కాంపాక్ట్ SUV సెగ్మెంట్‌లో భారతదేశంలో విడుదల చేసిన మొదటి మోడల్ ఈ డస్టర్. అయితే, అమ్మకాలు పడిపోవడంతో ఈ వాహనం భారతదేశంలో కనుమరుగైంది. 
 
అయితే ఇప్పుడు దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీ ఈ డస్టర్ ఎస్‌యూవీకి కొత్త ప్రాణం పోసింది. చాలా మార్పులు చేసి లాంచ్‌కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో, ఈ మోడల్ ఫీచర్లను ఇక్కడ తెలుసుకుందాం.
 
రెనాల్ట్ డస్టర్ SUV ఈ ఏడాది నవంబర్ 29న అంతర్జాతీయ మార్కెట్‌లో విడుదల కానుంది. గత మోడళ్లతో పోలిస్తే ఇది మరింత పవర్ ఫుల్‌గా ఉంటుందని కంపెనీ తెలిపింది. 
 
లాంచ్ తర్వాత, కొత్త డస్టర్ త్వరలో దక్షిణ అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మార్కెట్లలో అందుబాటులో ఉంటుంది. ఇది 2024 ప్రారంభంలో యూరోపియన్ మార్కెట్లోకి ప్రవేశిస్తుంది.
 
 డస్టర్ ఎస్‌యూవీని 2012లో తొలిసారిగా భారత్‌లో విడుదల చేశారు. ఆ సమయంలో ఈ మోడల్‌కు పెద్దగా పోటీ లేదు. అమ్మకాల వృద్ధి కూడా బాగానే ఉంది. ఆ తర్వాత భారతదేశంలో SUV విభాగంలో చాలా వాహనాలు వచ్చాయి. డస్టర్ అమ్మకాలలో వెనుకబడి ఉంది. చివరగా.. రెనాల్ట్ ఈ మోడల్‌ను 2022లో భారత్‌లో నిలిపివేసింది. 
 
ఇక 2023లో రెనాల్ట్ డస్టర్ ఇండియాలో కూడా రానుంది. కాకపోతే ఇప్పుడు లాంచ్ కాకపోవచ్చు. భారత్‌లో ప్రవేశానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.
 
 కొత్త రెనాల్ట్ డస్టర్ ఎస్‌యూవీలో 3 ఇంజన్ ఆప్షన్‌లు ఉంటాయి. 1.3 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ 167.6 bhp శక్తిని ఉత్పత్తి చేస్తుంది. 1.0 లీటర్ పెట్రోల్ ఇంజన్ 109 హెచ్‌పి పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. 1.2 లీటర్ పెట్రోల్ హైబ్రిడ్ ఇంజన్ 138 హెచ్‌పి పవర్ ఉత్పత్తి చేస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జైలులో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న చంద్రబాబు!!