విద్యార్థులకు ఇకపై సులభంగా రుణాలు అందనున్నాయి. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం.. క్రెడిట్ గ్యారంటీ పండ్ స్కీమ్ ఫర్ ఎడ్యుకేషన్ లోన్స్ పరిధిలోకి తీసుకురావాలని ఆలోచిస్తోంది. విద్యార్థులకు ఎక్కువ ఎడ్యుకేషన్ లోన్స్ అందించేలా చూడటమే లక్ష్యమని కేంద్రం చెప్తోంది. దీనివల్ల స్టూడెంట్స్ మరింత సులభంగా ఎడ్యుకేషన్ లోన్స్ పొందటం వీలవుతుంది.
క్రెడిట్ గ్యారంటీ ఫండ్ స్కీమ్ ఫర్ ఎడ్యుకేషన్ లోన్స్ అనేది ఎవరైనా విద్యా రుణం తీసుకొని తిరిగి చెల్లించలేక డిఫాల్ట్ అయితే అప్పుడు ఈ స్కీమ్ కింద రూ. 7.5 లక్షల వరకు బ్యాంక్‌కు డబ్బులు లభిస్తాయి.
ప్రస్తుతం ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులు, విదేశీ బ్యాంకులకు ఈ స్కీమ్ వర్తిస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు గ్రామీణ బ్యంకులను కూడా ఈ పరిధిలోకి తీసుకురావాలని కేంద్రం భావిస్తోంది.
ప్రభుత్వం గత కొంత కాలంలో గ్రామీణ బ్యాంకులను మరింత బోలపేతం చేసే దిశగా పలు నిర్ణయాలు తీసుకుంటూ వస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకోనుంది.
ఆగస్ట్ 25న కేంద్ర ప్రభుత్వం ఎడ్యుకేషన్ లోన్స్‌కు సంబంధించి పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల మంజూరు, పెరుగుదల వంటి అంశాలపై చర్చించింది. ఎడ్యుకేషన్ రుణాల మంజూరులో జాప్యం లేకుండా త్వరితగతిన వీటిని మంజూరు చేయాలని కేంద్రం బ్యాంకులను కోరినట్లు తెలుస్తోంది.