Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

UPI Lite wallet limit యూపీఐ లైట్ పరిమితి పెంపు

Advertiesment
reserve bank of india

ఠాగూర్

, గురువారం, 5 డిశెంబరు 2024 (11:11 IST)
యూపీఐ లైట్ పరిమితి పెంపు 
ఆర్బీఐ కీలక నిర్ణయం : యూపీఐ లైట్ పరిమితి పెంపు 
శుభవార్త చెప్పిన ఆర్బీఐ.. యూపీఐ లైట్ పరిమితి పెంపు 
 
భారత రిజర్వు బ్యాంకు యూపీఏ యూజర్లకు శుభవార్త చెప్పింది. యూపీఐ లైట్‌కు సంబంధించి గరిష్ట పరిమితిని పెంచింది. యూపీఐ లైట్ వాలెట్ పరిమితిని రూ.5 వేలకు పెంచింది. ప్రస్తుతం ఈ మొత్తం రూ.2 వేలుగా ఉంది. అలాగే, ఒక్కో లావాదేవీ పరిమితిని సైతం రూ.500 నుంచి వెయ్యి రూపాయలకు పెంచుతున్నట్లు తెలిపింది. 
 
సత్వరమే జరిగే ఈ డిజిటల్ చెల్లింపులను మరింత ప్రోత్సహించే ఉద్దేశంతో లైట్ పరిమితిని పెంచినట్లు ఆర్బీఐ తెలిపింది. అక్టోబరు నెలలో ఎంపీసీ భేటీ సందర్భంగా దీనికి సంబంధించి ఆర్బీఐ ప్రకటన చేసింది. ఎలాంటి పిన్ ఎంటర్ చేయకుండానే యూపీఐ పేమెంట్స్ చేయడానికి ఉపయోగించేదే యూపీఐ లైట్. 
 
ఈ సేవలు పొందాలంటే ముందుగా యూపీఐ లైట్ వాలెట్ బ్యాలెన్స్ ఉండాలి. బ్యాంకు ఖాతా నుంచి యూపీఐ ద్వారా లోడ్ చేసుకోవచ్చు. ఆపై స్కాన్ చేసిన ప్రతిసారీ పిన్ ఎంటర్ చేయకుండానే పేమెంట్ చేయొచ్చు. యూపీఐ లైట్ విస్తృతంగా వినియోగించే వారికి ఈ నిర్ణయంతో పదే పదే లోడ్ చేసుకోవాల్సిన అవసరం తప్పుతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Jio 5G data plans starting from Rs 200 -కస్టమర్ల కోసం ఇదంతా చేస్తోన్న జియో