Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వీగన్‌ స్కిన్‌కేర్‌ బ్రాండ్‌ ప్లమ్‌లో ఇన్వెస్టర్‌, బ్రాండ్‌ అంబాసిడర్‌గా చేరిన రష్మిక మందన్న

Rashmika Mandanna
, మంగళవారం, 28 జూన్ 2022 (23:11 IST)
భారతదేశపు సుప్రసిద్ధ, 100% వెగాన్‌, హింసరహిత, విషరసాయనాలు లేని బ్యూటీ, పర్సనరల్‌ కేర్‌ బ్రాండ్‌, ప్లమ్‌ కోసం ప్రచారకర్తగా, బ్రాండ్‌ అంబాసిడర్‌, ఇన్వెస్టర్‌గా భారతీయ నటి రష్మిక మందన్న చేరారు. ‘పుష్ప: ద రైజ్‌’ చిత్ర నటితో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న బ్యూటీ, పర్సనల్‌ కేర్‌ బ్రాండ్‌లలో ఒకటైన ప్లమ్‌ నడుమ ఈ భాగస్వామ్యం, అభిమానుల ఫేవరేట్‌ బ్రాండ్‌గా ప్లమ్‌ స్థానాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటుగా వినియోగదారులను సొంతం చేసుకోవడం పరంగా, మరీ ముఖ్యంగా భారతదేశంలో జెన్‌ జెడ్‌, మిల్లీనియల్‌ తరాన్ని సొంతం చేసుకోవడంలో నూతన మార్గాలను సృష్టించనుంది.

 
తొలిసారిగా 2018 సంవత్సరాంతంలో ఇది ఫండింగ్‌ రౌండ్‌కు వెళ్లిన నాటి నుంచి ప్లమ్‌15 రెట్లు వృద్ధి చెందింది. శక్తివంతమైన నాయకత్వం, మదుపరుల బృందం తోడుగా  ఇది ప్రజలు, భూగోళంకు విలువను  అభివృద్ధి చేయడంతో పాటుగా పార్టిస్పెంట్స్‌కు లాభాలను పంచడంపై అధికంగా దృష్టి సారించింది. నూతన తరపు బ్యూటీ విభాగంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న బ్రాండ్‌లలో ఒకటిగా నిలిచింది ప్లమ్‌. అత్యున్నత నాణ్యత కలిగిన  ఉత్పత్తి శ్రేణి, ప్రియమైన బ్రాండ్‌ వ్యక్తిత్వం, శక్తివంతమైన ఓమ్నీ ఛానెల్‌ ఉనికి దీనికి తోడ్పడుతుంది. అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌, నైకా, పర్పుల్‌ లాంటి కీలకమైన ఈ-కామర్స్‌ మార్కెట్‌ ప్రాంగణాలలో టాప్‌ బ్రాండ్‌లలో ఒకటిగా నిలువడం మాత్రమే కాక భారతదేశ వ్యాప్తంగా 250కు పైగా పట్టణాలు, నగరాలలో ఈ బ్రాండ్‌ 1000కు పైగా సహాయక  రిటైల్‌ ఔట్‌లెట్లు మరియు 10000కు పైగా అన్‌ అసిస్టెడ్‌ ఔట్‌లెట్లు ద్వారా లభ్యమవుతూ ప్రతి నెలా గణనీయమైన వృద్ధిని సాధిస్తుంది. 

 
ఈ బ్రాండ్‌ను నేడు పలు ఛానెల్స్‌, విభాగాల వ్యాప్తంగా విస్తృత శ్రేణిలో అభిమానిస్తున్నారు. వీటిలో స్కిన్‌, హెయిర్‌, బాడీ, మెన్స్‌ కేర్‌, ఇప్పుడు మేకప్‌ విభాగాలు ఉన్నాయి. తద్వారా క్లీన్‌ బ్యూటీ ఉత్పత్తుల కోసం అత్యంత వేగంగా పెరుగుతున్న మార్కెట్‌లో ఆధిపత్యం చూపుతూ తమ సామర్థ్యం పునరుద్ఘాటిస్తుంది. నెట్‌ రెవిన్యూ పద్ధతిలో  300 కోట్ల రూపాయల ప్రస్తుత ఏఆర్‌ఆర్‌తో  ప్లమ్‌ యొక్క లక్ష్యం రాబోయే 12 నెలల్లో ఈ సంఖ్యలను రెట్టింపు చేయడం. ఈ బ్రాండ్‌ ఇప్పుడు తమ ఆన్‌లైన్‌ ఉనికిని విస్తరించడానికి ప్రణాళికచేయడంతో పాటుగా భారతదేశ వ్యాప్తంగా ఆఫ్‌లైన్‌లో సైతం తమ కార్యకలాపాలను విస్తరించడానికి ప్రణాళిక చేసింది. దీనితో పాటుగా తమ ఉత్పత్తిని సైతం పెంచడం, వినూత్నమైన ఉత్పత్తులను ఆవిష్కరించడం మరియు తమ నాయకత్వ  బృందం కింద మహోన్నత ప్రతిభావంతులను నియమించుకోవడం చేయనుంది.

 
ఈ నూతన భాగస్వామ్యం పట్ల తన సంతోషాన్ని రష్మిక మందన్న వ్యక్తీకరిస్తూ ‘‘నా అభిమాన బ్రాండ్‌లలో ప్లమ్‌ ఒకటి. అది ఏం చెబుతుందో , అదే చేస్తుంది. ఈ బ్రాండ్‌కు ప్రాతినిధ్యం వహిస్తుండటం పట్ల సంతోషంగా ఉన్నాను. అంతేకాదు ఈ సంస్ధలో పెట్టుబడులు కూడా పెడుతున్నాను. మనం నివసిస్తోన్న ప్రపంచానికి మంచి చేయాలని కోరుకుంటున్న ఓ సంస్థలో పెట్టుబడులు పెట్టడం ద్వారా తగిన మద్దతునందిస్తున్నాను. గత కొద్ది సంవత్సరాలుగా ప్లమ్‌ అసాధారణ వృద్ధిని నమోదుచేస్తుంది మరియు రాబోయే కాలంలో గో-టు వెగాన్‌ బ్రాండ్‌గా ఇది నిలువనుందనే విశ్వాసంతో నేను ఉన్నాను. ప్లమ్‌ ఇప్పుడు వేగవంతమైన జీవితంలో సూర్యకాంతి, కాలుష్యం బారిన పడుతున్న మన చర్మానికి ఎలాంటి ఇబ్బంది కలిగించని, అవసరమైన ఉత్పత్తులను సృష్టిస్తుంది. నా వరకూ నేను ప్లమ్‌ ఉత్పత్తులను ఎంతోకాలంగా వినియోగిస్తున్నాను.  నేను వాటిని పూర్తిగా అభిమానిస్తున్నాను. ప్రతి ఇంటిలోనూ స్కిన్‌కేర్‌ ప్రేమ, చక్కదనం తీసుకురావడం పట్ల నేను పూర్తి ఆసక్తిగా ఉన్నాను’’ అని అన్నారు.

 
ప్లమ్‌ ఫౌండర్‌ , సీఈఓ శంకర్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ ‘‘వినియోగదారులతో మా బ్రాండ్‌ బంధాన్ని మరింతగా బలోపేతం చేయాలని కోరుకుంటున్న వేళ  రష్మిక మాతో చేరడం పట్ల చాలా సంతోషంగా ఉన్నాము. ఆమె అత్యంత ప్రాచుర్యం పొందిన యూత్‌ ఐకాన్‌. ప్లమ్‌ యొక్క బ్రాండ్‌ విలువలకు ఆమె  వాస్తవమైన, చేరువయ్యే వ్యక్తిత్వం చక్కగా సరిపోతుంది. ఎక్కువ మంది అభిమానించే బ్రాండ్‌గా ప్లమ్‌ను అభివృద్ధి చేయాలనుకుంటున్న వేళ ఈ భాగస్వామ్యం అత్యంత ముఖ్యమైన మైలురాయిగా నిలువనుంది. ఇది వస్తువులను స్వచ్ఛంగా, వాస్తవికంగా మరియు చక్కగా ఉండటానికి ప్రతీకగా నిలుస్తుంది..’’అని అన్నారు. రష్మిక పెట్టుబడులు, మార్చి 2022లో ఏ91 పార్టనర్స్‌ నేతృత్వంలోని 35 మిలియన్‌ డాలర్ల ఫండింగ్‌ రౌండ్‌ను అనుసరించి  ఉన్నాయి. ఇప్పటి వరకూ ప్లమ్‌ మొత్తంమ్మీద 50 మిలియన్‌ డాలర్లను వినియోగదారుల లక్ష్యిత సంస్ధాగత మదుపరుల నుంచి  సమీకరించింది.  ఇది నూతన యుగపు డీ2సీ బ్యూటీ విభాగంలో  విభాగపు నాయకునిగా దాని భవిష్యత్‌ వృద్ధిని సూచిస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తండ్రి అంత్యక్రియలు చేసేందుకు భిక్షాటన చేసిన కుమార్తె