Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

విమర్శలకు తలొగ్గిన కేంద్రం - రైళ్లలో రాయితీల పునరుద్ధరణకు ఓకే

indian railway
, బుధవారం, 27 జులై 2022 (20:23 IST)
సీనియర్ సిటిజన్లతో పాటు ప్రత్యేక కేటగిరీలకు చెందిన వారికి రైళ్లలో ఇచ్చే రాయితీలను కరోనా లాక్డౌన్ తర్వాత నిలిపివేశారు. ప్రస్తుతం పరిస్థితులు చక్కబడినప్పటికీ వీటిని పునరుద్ధరించేందుకు కేంద్రం ససేమిరా అంటోంది. దీనిపై అనేక విమర్శలు వచ్చాయి. దీంతో కేంద్రం దిగివచ్చింది. గతంలో ఇస్తున్న అన్ని రకాల రాయితీలను తిరిగి పనరుద్ధరించేందుకు సమ్మతించినట్టు సమాచారం. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలో బుధవారం జరిగిన కేంద్ర మంత్రిమండలిలో చర్చించి ఓ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. అయితే, ఈ రాయితీల పునరుద్ధరణపై భారతీయ రైల్వే శాఖ అధికారిక ప్రకటన విడుదల చేయాల్సివుంది. 
 
"గతంలో ఇస్తూ వచ్చిన రాయితీలు వృద్ధులకు సహాయపడుతాయని తాము అర్థం చేసుకున్నామని, రాయితీని పూర్తిగా ఎత్తివేస్తున్నట్టుగా ఎన్నడూ చెప్పలేదని, దీనిపై సమీక్ష చేస్తున్నాం. నిర్ణయం తీసుకుంటాం" అని రైల్వే శాఖ పేర్కొంది. 
 
అయితే, వయో పరిమితిలో మెలిక పెట్టేలా కనిపిస్తుంది. ప్రస్తుతం 60 యేళ్లు పైబడిన వారిని సీనియర్ సిటిజన్లుగా పేర్కొంటూ రైల్వే టిక్కెట్‌లో 50 శాతం రాయితీని ఇస్తుంది. ఇపుడు ఈ వయో పరిమితిని 70 యేళ్లకు చేయాలని భావిస్తుంది. అలాగే, నిబంధనలు కూడా మార్చాలని భావిస్తుంది. 
 
ఈ రాయితీని కేవలం నాన్ ఏసీ బోగీలకే పరిమితం చేయాలని యోచిస్తుంది. స్లీపర్, జనరల్ కేటగిరీకి పరిమితం చేస్తే 70 శాతం మంది ప్రయాణికులకు అందుతుందని భావిస్తుంది. అలాగే, అన్ని రైళ్లలోనూ ప్రీమియర్ తత్కాల్ పథకాన్ని ప్రారంభించాలని రైల్వే శాఖ ఆలోచన చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బీఎస్ఎన్ఎల్‌ పునరుద్ధరణ కోసం రూ.1.64 లక్షల కోట్లు