Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రతిపాదిత 35 శాతం GST అక్రమ వ్యాపారానికి ఆజ్యం పోయనుంది

Advertiesment
Smoking

ఐవీఆర్

, బుధవారం, 11 డిశెంబరు 2024 (22:59 IST)
పొగాకు, ఎరేటెడ్ డ్రింక్స్ వంటి అధిక-పన్ను ఉత్పత్తులపై ప్రతిపాదిత 35% GST స్లాబ్ ప్రతికూల ప్రభావాలను చూపటంతో పాటుగా భారతదేశ ఆర్థిక వ్యవస్థ, ఉపాధి మరియు పొగాకు నియంత్రణ ప్రయత్నాలకు తీవ్రమైన నష్టాలను కలిగించనుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సిగరెట్లపై అధిక పన్నులు వినియోగదారులను చౌక ఉత్పత్తులు, అక్రమ ప్రత్యామ్నాయాల వైపు తీసుకువెళ్లడంతో పాటుగా స్మగ్లింగ్ మార్కెట్‌కు ఇతోధికంగా తోడ్పడనుంది. 2012-2017 మధ్య కాలంలో ఎక్సైజ్ రేట్లు 15.7% సీఏజీఆర్ పెరిగాయి, 2017లో 20%, 2020లో 13%, మరియు 2023లో 16% చొప్పున సిగరెట్ పన్ను పెంపు గణనీయంగా ఉంది. ఈ కారణాల చేత భారతదేశం ఇప్పుడు నాల్గవ అతిపెద్ద అక్రమ సిగరెట్ మార్కెట్‌‌గా నిలిచింది, దీని వలన ప్రభుత్వానికి సంవత్సరానికి రూ. 21,000 కోట్లు నష్టం వాటిల్లుతుంది. 
 
స్మగ్లింగ్ సిగరెట్‌ల పెరుగుదల భారతదేశంలో పండించే పొగాకుకు డిమాండ్‌ను తగ్గించింది, దీనివల్ల రైతు ఆదాయం కూడా తగ్గింది. భారతదేశంలో వినియోగించబడే పొగాకులో ఎక్కువ భాగం (68%) అసంఘటిత రంగం నుండి వస్తుంది. చట్టబద్ధమైన సిగరెట్ పరిశ్రమ, బీడీ మరియు పొగలేని విభాగాలలో కొంత భాగం వ్యవస్థీకృత రంగం కిందకు వస్తాయి. పొగాకు ఆకులపై GST యొక్క రివర్స్ ఛార్జ్ మెకానిజం కింద పన్ను విధించబడుతుంది. బీడీలు మరియు పొగలేని ఉత్పత్తులలో ఉపయోగించే FCV యేతర పొగాకు ఉత్పత్తులను కూడా నియంత్రించడం వలన వాటిని పూర్తిగా పన్ను పరిధిలోకి తీసుకురావడానికి సహాయపడుతుంది.
 
భారతదేశం యొక్క అధిక సిగరెట్ పన్నులు అక్రమ వ్యాపారానికి ఆజ్యం పోశాయి, స్థానిక సమాజాలను దెబ్బతీశాయి. పన్నుల యొక్క సమతుల్య విధానం చట్టపరమైన మార్కెట్‌ను పునరుద్ధరించగలదు, అక్రమ వ్యాపారాన్ని తగ్గించగలదు మరియు ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శామ్‌సంగ్ గెలాక్సీ S24 అల్ట్రా, గెలాక్సీ S24 స్మార్ట్‌ఫోన్‌లు విడుదల