Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తెలంగాణలో పొగాకు టైమ్ బాంబ్: పదిహేనేళ్లు దాటినవారిలో 22.3% మంది బానిసలు

tobacco

ఐవీఆర్

, గురువారం, 8 ఆగస్టు 2024 (18:02 IST)
భారతదేశంలో పొగాకు వాడకం ప్రమాదకరంగా పెరుగుతుందని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. దాదాపు 267 మిలియన్ల పెద్దలు లేదా మొత్తం వయోజన జనాభాలో 29% మంది పొగాకుకు బానిసలయ్యారు. గ్లోబల్ అడల్ట్ టుబాకో సర్వే (GATS) ఇండియా 2016-17 సమస్య యొక్క భయంకరమైన చిత్రాన్ని ఆవిష్కరించింది, పొగలేని పొగాకు వినియోగం ప్రబలంగా ఉందని ఇది వెల్లడించింది. అయితే, సంక్షోభం దేశమంతటా ఏకరీతిగా లేదు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (NFHS-5) డేటా ప్రకారం, తెలంగాణ వంటి రాష్ట్రాలలో 15 ఏళ్లు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు గల పురుషులలో 22.3% మంది పొగాకు వాడుతున్నారు. 
 
హైదరాబాద్‌లోని ఉస్మానియా మెడికల్ కాలేజీ మాజీ డీన్, మైక్రోబయాలజీ ప్రొఫెసర్ డాక్టర్. పి. శశికళ పాల్కొండ మాట్లాడుతూ, “తెలంగాణలో, 15 ఏళ్లు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పురుషులలో 22.3% మంది పొగాకును ఉపయోగిస్తున్నారనడం గణనీయమైన ప్రజారోగ్య సమస్యను వెల్లడిస్తుంది. భారతదేశంలో దాదాపు 267 మిలియన్ల మంది పెద్దలు పొగాకును ఉపయోగిస్తున్నందున, ప్రత్యామ్నాయ పద్ధతులు మరియు పొగాకు విరమణ విధానాలను అనుసరించటం అత్యవసరం. ఈ ప్రత్యామ్నాయాలు అధికంగా ధూమపానం చేసేవారికి మాత్రమే అందుబాటులో ఉండాలి. జపాన్, స్వీడన్, యుకె , యుఎస్ఏ నుండి విజయవంతమైన వ్యూహాలను అనుసరించటం, నిపుణులను సంప్రదించడం ద్వారా, వ్యసనాన్ని ప్రభావంతంగా ఎదుర్కోవడానికి HTPల వంటి సురక్షితమైన ప్రత్యామ్నాయాలను మనం పరిచయం చేయవచ్చు" అని అన్నారు. 
 
పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ మోహ్సిన్ వలీ మాట్లాడుతూ, “పొగాకు అలవాటు మాన్పించటానికి అనుసరిస్తున్న ప్రస్తుత కార్యాచరణకు సమగ్ర మార్పు చేయాల్సి ఉంది. హానిని తగ్గించటానికి ఇతర దేశాలలో ప్రభావవంతంగా నిరూపించబడిన వ్యూహాలను మనం తప్పనిసరిగా అనుసరించాలి. ఉదాహరణకు, HTPల వంటి ప్రత్యామ్నాయాలు, ప్రపంచవ్యాప్తంగా 80కి పైగా దేశాల్లో ఉపయోగించబడుతున్నాయి. ప్రజా ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఈ ప్రత్యామ్నాయాలను భారతీయులు పరిశీలించాల్సిన సమయం ఆసన్నమైంది" అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్లీజ్.. మాకు నాలుగు కుంకీ ఏనుగులు ఇవ్వండి.. సీఎం సిద్ధూను కోరిన డిప్యూటీ సీఎం పవన్