Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Monday, 28 April 2025
webdunia

వరుసగా తగ్గుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు... పైసల్లో తగ్గింపా...?

Advertiesment
Petrol
, శుక్రవారం, 1 ఫిబ్రవరి 2019 (11:08 IST)
దేశంలోని వివిధ మెట్రో నగరాలలో వరుసగా రెండో రోజు కూడా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతున్నాయి. శుక్రవారం కూడా ఇంధన ధరలు తగ్గాయి, అయితే అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి.

దేశ వాణిజ్య రాజధాని ముంబైలో పెట్రోల్ ధర 10 పైసలు తగ్గి 76.72 రూపాయలుగా, డీజిల్ ధర 8 పైసలు తగ్గి 68.91 రూపాయలుగా ఉండగా, ఇతర మెట్రో నగరాలైన చెన్నై మరియు కోల్కటాలో పెట్రోల్ ధర 17 పైసలు తగ్గి 73.80 రూపాయలుగా, డీజిల్ ధర 15 పైసలు తగ్గి 69.52 రూపాయలుగా ఉంది. బెంగుళూరులో నిన్నటితో పోలిస్తే లీటరుకు 9 పైసలు తగ్గి, 73.44 రూపాయలుగా పెట్రోల్ మరియు 67.98 రూపాయలుగా డీజిల్ అమ్ముడుపోతున్నాయి.
 
అధిక ఉత్పత్తి కారణంగా దిగొచ్చిన ముడి ఇంధన ధరల ప్రభావం కారణంగానే భారతదేశంలో చమురు ధరలు పడిపోతున్నాయని విశ్లేషకుల అభిప్రాయం. అయితే వినియోగదారులు మాత్రం పెంచేటప్పుడు రూపాయల్లో పెంచి, తగ్గుతున్నప్పుడు మాత్రం పైసలలో తగ్గడం వలన ఏ మాత్రం సంతృప్తికరంగా భావించడం లేదు. అయితే ఈ తగ్గింపు ఇంకా కొనసాగుతుందో లేదో వేచి చూడాలి మరి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పవన్ నన్ను అడగలేదే.. మంత్రి పదవి ఇచ్చే పార్టీలో చేరుతా: అలీ