Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఖాతాదారులకు ఈఎమ్ఐ ఆఫ్షన్స్, జెస్ట్ మనీతో చేతులు కలిపిన ఒకినావా

Advertiesment
Okinawa
, మంగళవారం, 3 నవంబరు 2020 (15:31 IST)
‘మేక్ ఇన్ ఇండియా’పై దృష్టి సారించే భారతీయ ఎలక్ట్రిక్ టూ వీలర్ బ్రాండ్ అయిన ఒకినావా, తన టూవీలర్ ప్రొడక్ట్‌లన్నింటిపైన సౌకర్యవంతమైన EMI ఫైనాన్సింగ్ అందించడానికి భారతదేశంలోని ప్రముఖ ఎఐ-ఆధారిత ఈఎమ్ఐ ఫైనాన్సింగ్ మరియు ‘‘ఇప్పుడు కొనుగోలు చేయండి, తరువాత చెల్లించండి’’(‘‘పే లేటర్’’) ఫ్లాట్‌ఫారం అయిన జెస్ట్‌మనీతో భాగస్వామ్యం నెరుపుతోంది.
 
ఈ పార్టనర్‌షిప్  గతంలో సిబిల్ స్కోరు లేని ఖాతాదారులు సైతం ఒకినావా ప్రొడక్ట్‌లు కొనుగోలు చేయడానికి ఫైనాన్సింగ్ ఆప్షన్‌లు పొందేందుకు అనుమతిస్తుంది. ఖాతాదారులు డిజిటల్ కెవైసి పూర్తి చేసి, కొనుగోలు సమయంలో వారి సౌకర్యవంతమైన తిరిగి చెల్లించే ప్లాన్ ఎంచుకోవడం ద్వారా జెస్ట్ మనీ నుంచి క్రెడిట్ లిమిట్‌ని ఉపయోగించుకోవచ్చు. 
 
ఈ ప్రక్రియ పూర్తిగా పేపర్‌లెస్ మరియు భౌతిక జోక్యం లేకుండానే ఆన్‌లైన్‌లో పూర్తిచేయవచ్చు. ఈ ఫెసిలిటీ పాన్ ఇండియాలోని 350కు పైగా ఒకినావా డీలర్‌షిప్‌ల వద్ద లభ్యమవుతుంది. దీనికి అదనంగా, ఖాతాదారులు ఒకినావా వెబ్‌సైట్ ద్వారా ప్రొడక్ట్‌ని ఆన్‌లైన్‌లో బుక్ చేసేటప్పుడు కూడా సర్వీస్‌ని ఉపయోగించుకోవచ్చు.
 
ఈ భాగస్వామ్యం ఖాతాదారులకు భరించగల సామర్థ్యాన్ని పెంచడం, అలానే ఎలక్ట్రిక్ స్కూటర్‌ను సొంతం చేసుకోవాలనే వారి నిర్ణయానికి దగ్గరగా ఉంటుందని భావిస్తున్నారు. ‘మహమ్మారి కారణంగా, చాలామంది వ్యక్తులు ఇతరులతో కలిసి ప్రయాణాలను పంచుకోవడానికి సందేహిస్తున్నారు. ఇప్పుడు సామాజిక దూరం ఒక జీవిత విధానమైంది మరియు వ్యక్తులు వ్యక్తిగత వాహనాలను ఎంచుకుంటున్నారు. లాక్‌డౌన్ ఎత్తివేసిన ఒక నెలరోజుల్లోనే, ఎలక్ట్రిక్ టూవీలర్స్ కొరకు డిమాండ్ పెరగడాన్ని మేం గమనించాం.
 
వ్యక్తులు తమ స్వంత వాహనాలను కొనుగోలు చేయడమే కాకుండా, ICEతో పోలిస్తే ఎలక్ట్రిక్ వాహనాల వైపు మెగ్గు చూపుతున్నట్లుగా ఇది వివరిస్తుంది. డబ్బు సమకూర్చుకోవడం కష్టంగా ఉన్న నేటి తరుణంలో, మా ఖాతాదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేవిధంగా ఫైనాన్స్‌ని ఎంచుకునేందుకు మేం జస్ట్‌మనీతో అసోసియేట్ అయ్యాం,” అని జితేందర్ శర్మ- ఎమ్‌డి మరియు కోఫౌండర్, ఒకినావా తెలిపారు.
 
పార్టనర్‌షిప్‌పై, లిజ్జీ చాప్‌మన్, సిఈవో & జస్ట్‌మనీ కో ఫౌండర్ మాట్లాడుతూ, “ఎలక్ట్రిక్ స్కూటర్‌లకు డిమాండ్ గణనీయంగా పెరిగిన ఈ నేపథ్యంలో ఒకినావాతో భాగస్వామ్యం నెరుపుతున్నందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది. సామాజిక దూరం చర్యలు కొనసాగడం వల్ల వ్యక్తులు ప్రయాణించే రీతిని కొవిడ్ మార్చింది. మా పే లేటర్ సర్వీస్ వారు స్వంత వాహనాన్ని కలిగి ఉండాలనే వారి కలను సాకారం చేసింది. ఈ సమయంలో ప్రజలు తమ ఫైనాన్స్‌లను ప్లాన్ చేయడాన్ని ఎంచుకోవడానికి ఈ సర్వీస్ మరింత కీలకం.
 
కొనుగోలు చేయగల సామర్థ్యం ఈ కేటగిరీలో ఇప్పటికే డిమాండ్‌ని పెంచడంలో ముఖ్యమైన పాత్రను పోషిస్తోంది, రాబోయే నెలల్లో ఇది మరింత గణనీయంగా పెరుగుతుంది.’’ కొవిడ్ 19 ప్రబలిన సమయంలో, ఒకినావా తన ఖాతాదారులకు సురక్షితమైన ప్రక్రియలను ఆఫర్ చేయడానికి అనేక చర్యలు తీసుకుంటోంది. తమ ఇళ్ల నుంచి బయటకు రాకుండానే ప్రొడక్ట్‌లను బుక్ చేసుకునే సౌలభ్యాన్ని కల్పించడానికి ఒకినావా ఇటీవల ఆన్‌లైన్ బుకింగ్ ప్రారంభించింది. 
జెస్ట్‌మనీతో ఈ అనుబంధం ఈ దిశగా మరో అడుగుగా చెప్పవచ్చు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎస్ఈసీకి జగన్ సర్కారు సహాయ నిరాకరణపై హైకోర్టు సీరియస్