గత ఆరు నెలల పాటు వరుసగా ధర పెరుగుతూ వచ్చిన సబ్సిడీ లేని సిలిండర్ ధర ఈ నెల తగ్గింది. గత ఏడాది ఆగస్చు నెలలో సబ్సిడీ లేని సిలిండర్ ధర రూ.590గా వున్నది. అయితే ప్రతి నెలా ఈ సిలిండర్ ధర పెరుగుతూ వచ్చింది. ఫిబ్రవరి ఏకంగా రూ.147 పెరిగిన ఈ సిలిండర్ ధర రూ.881లకి అమ్మబడింది.
సిలిండర్ ధరలు పెరిగిపోతున్న నేపథ్యంలో పలు సంస్థ ఇందుకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టారు. ఫలితంగా మార్చి నెల సిలిండర్ ధర రూ.55కి తగ్గింది. దీంతో సబ్సిడీ లేని సిలిండర్ ధర రూ.826 పలుకుతోంది. ఈ ధరలు మార్చి రెండో తేదీ నుంచి అమలులోకి వచ్చింది. దీంతో హమ్మయ్య అంటూ ప్రజలు ఊపిరిపీల్చుకుంటున్నారు.