Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నిప్పాన్‌ ఇండియా ఫ్లెక్సీ క్యాప్‌ ఫండ్‌ను ఆవిష్కరించిన నిప్పాన్‌ ఇండియా మ్యూచువల్‌ ఫండ్‌

Advertiesment
NIPPON INDIA MUTUAL FUND
, మంగళవారం, 20 జులై 2021 (21:57 IST)
నిప్పాన్‌ ఇండియా మ్యూచువల్‌ ఫండ్‌ (ఎన్‌ఐఎంఎఫ్‌)కు చెందిన ఎస్సెట్‌ మేనేజర్‌ నిప్పాన్‌ లైఫ్‌ ఇండియా ఎస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ (నామ్‌ ఇండియా) తమ నిప్పాన్‌ ఇండియా ఫ్లెక్సీ క్యాప్‌ ఫండ్‌ను ఆవిష్కరించినట్లు వెల్లడించింది.
 
ఇది ఓపెన్‌ ఎండెడ్‌ డైనమిక్‌ ఈక్విటీ పథకం. మార్కెట్‌ క్యాప్స్‌ వ్యాప్తంగా అవకాశాలను ఒడిసినట్టుకునే ఏకీకృత పరిష్కారాన్ని ఇది అందిస్తుంది. మార్కెట్‌ వీక్షణ, సంబంధిత ఆకర్షణీయతను పరిగణలోకి తీసుకుని భారీ, మధ్య మరియు చిన్న క్యాప్స్‌ వ్యాప్తంగా వైవిధ్యమైన జాబితాలో పెట్టుబడులు పెట్టడం ద్వారా దీర్ఘకాలంలో సంపద వృద్ధిని నిప్పాన్‌ ఇండియా ఫ్లెక్సీ క్యాప్‌ ఫండ్‌ కోరుకుంటుంది.
 
ఈ నూతనఫండ్‌ ఆఫర్‌ (ఎన్‌ఎఫ్‌ఓ) 26 జూలై 2021వ తేదీన తెరుస్తారు మరియు 09 ఆగస్టు 2021వ తేదీన మూసివేస్తారు. ఈ ఫండ్‌ను నిఫ్టీ 500 టీఆర్‌ఐకు బెంచ్‌మార్క్‌ చేశారు. కనీస పెట్టుబడిగా 500 రూపాయలు మరియు ఆ పైన 1 రూపాయి గుణిజాలతో ఎంతైనా పెట్టుబడి పెట్టవచ్చు.
 
ఈ ఆవిష్కరణ సందర్భంగా సౌగట ఛటర్జీ, కో-చీఫ్‌ బిజినెస్‌ ఆఫీసర్‌, నిప్పాన్‌ ఇండియా మ్యూచువల్‌ ఫండ్‌ మాట్లాడుతూ, ‘‘మా విస్తృతశ్రేణి ఇన్వెస్టర్‌ కేంద్రీకృత ఉత్పత్తుల జాబితాకు నిప్పాన్‌ ఇండియా ఫ్లెక్సీ క్యాప్‌ ఆవిష్కరణను జోడించడం ద్వారా ఇన్వెస్టర్‌ కమ్యూనిటీకి మా ఆఫరింగ్స్‌ను మరింతగా విస్తరించాం. ఈక్విటీ రంగంలో అతి పెద్ద విభాగాలలో ఫ్లెక్సీ క్యాప్‌ ఒకటి. జూన్‌ చివరినాటికి నూతనంగా సృష్టించిన ఫ్లెక్సీ క్యాప్‌ విభాగం కింద ఉన్న నిర్వహణలోని ఆస్తులు (ఏయుఎం) 1.76 ట్రిలియన్‌ రూపాయలు. నిప్పాన్‌ ఇండియా ఫ్లెక్సీ క్యాప్‌ ఫండ్‌తో, మార్కెట్‌ క్యాప్స్‌ వ్యాప్తంగా లభ్యమయ్యే అత్యుత్తమ అవకాశాలలో పెట్టుబడులు పెట్టడం ద్వారా మెరుగైన రాబడులు అందించడానికి లక్ష్యంగా చేసుకున్నాం’’ అని అన్నారు.
 
మనీష్‌ గుణ్వానీ, సీఐఓ- ఈక్విటీ ఇన్వెస్ట్‌మెంట్స్‌, నిప్పాన్‌ ఇండియా మ్యూచువల్‌ ఫండ్‌ మాట్లాడుతూ, ‘‘ప్రస్తుత మార్కెట్‌ పరిస్థితులు ఫ్లెక్సీ క్యాప్‌ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టేందుకు అవకాశాలు సృష్టిస్తాయని నమ్ముతున్నాం. ప్రస్తుత సూక్ష్మ ఆర్ధిక నిబంధనలు ఫ్లెక్సీ క్యాప్‌ విభాగానికి అనుకూలంగా ఉన్నాయి..’’ అని అన్నారు. ఈ ఫండ్‌ను మనీష్‌ గుణ్వానీ, సీఐఓ-ఈక్విటీ ఇన్వెస్ట్‌మెంట్‌ తో పాటుగా ధృమిల్‌ షా, వరుణ్‌ గోయెంకా, నిఖిల్‌ రుంగ్తా (కో-ఫండ్‌ మేనేజర్‌), కింజాల్‌ దేశాయ్‌, ఫండ్‌ మేనేజర్‌- ఓవర్‌సీస్‌ నిర్వహించనున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సంబరాలు చేసుకుంటున్న రోజా వ్యతిరేకులు, ఎందుకు?