Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మార్కెట్‌లోకి విడుదలైన చవులూరించే సిద్స్‌ ఫార్మ్‌ యొక్క ఆవు, గేదె పెరుగు కప్పులు

మార్కెట్‌లోకి విడుదలైన చవులూరించే సిద్స్‌ ఫార్మ్‌ యొక్క ఆవు, గేదె పెరుగు కప్పులు
, మంగళవారం, 20 జులై 2021 (15:34 IST)
భారతీయ ఆర్ధిక వ్యవస్థలో పాల ఉత్పత్తి, పాల ఉత్పత్తుల విక్రయం అతి ముఖ్యమైన కార్యకలాపాలుగా నిలుస్తున్నాయి. నేటి తరపు రద్దీ జీవనశైలి కారణంగా వారు ఆహారం, పోషకాల కోసం పాల ఉత్పత్తులపై ఆధారపడుతున్నారు. చాలామంది ప్రజలు అతి తక్కువ కొవ్వు శాతం ఉండటంతో పాటు ఇతర పోషక విలువల కారణంగా ఆవు పాలపై ఆధారపడుతున్నారు. 
 
అదే సమయంలో అధిక కొవ్వు, పోషకాలు మరియు లాక్టోజ్‌ కారణంగా గేదె పాలనూ ఇష్టపడుతున్న వారు కూడా అంతే స్ధాయిలో ఉన్నారు. ఈ అంశాలన్నీ పరిగణలోకి తీసుకుని సిద్స్‌ ఫార్మ్‌ ఇప్పుడు అత్యంత రుచికరమైన, చవులూరించే ఆవు, గేదె పెరుగు కప్పులను తీసుకువచ్చింది. ఇవి అత్యున్నత పోషక విలువలు కలిగి ఉండటంతో పాటుగా  ఆర్థికంగా కూడా అందుబాటు ధరలో ఉంటాయి.
 
సిద్స్‌ ఫార్మ్‌ ఫౌండర్‌ కిశోర్‌ ఇందుకూరి మాట్లాడుతూ, ‘‘మార్కెట్‌లో లభ్యమవుతున్న ఇతర పెరుగు, యోగార్ట్‌లులా  కాకుండా సిద్స్‌ ఫార్మ్‌ విడుదల చేసిన పెరుగులో ఎలాంటి నిల్వ కారకాలూ జోడించబడలేదు. మన ఇంటిలోని కమ్మటి రుచి కలిగిన పెరుగు రుచిని ఇది చవిచూపిస్తుంది. పాల పదార్ధాలలో ఎక్కువ మంది అభిమానించేది పెరుగు అని కంపెనీ నమ్ముతుంది. అంతేకాదు, పాలతో పోలిస్తే పెరుగు త్వరగా జీర్ణమవుతుంది. అందువల్ల ఎలాంటి వయసు గ్రూప్‌వారైనా దీనిని తినవచ్చు. మేము క్రీమీ బఫెలో మిల్క్‌ కర్డ్‌ను 475 గ్రాముల ప్యాక్‌లో కేవలం 80 రూపాయలకు, చవులూరించే  ఆవు పాల పెరుగును 475 గ్రాముల ప్యాక్‌లో కేవలం70 రూపాయలకు అందిస్తున్నాం’’ అని అన్నారు.
 
ఈ చక్కదనం ఇక్కడితో ముగియదు, నూతనంగా విడుదల చేసిన ఈ రెండు పెరుగులలో పోషకాలు అధికంగా ఉంటాయి. వీటిలో 38 గ్రాముల ప్రొటీన్‌, 5 గ్రాముల ఫ్యాట్‌ గేదె పెరుగులో ఉంటే, 4 గ్రాముల కొవ్వు, 35 గ్రాముల ప్రొటీన్‌ ఆవు పాల పెరుగులో ఉంటుంది. సిద్స్‌ ఫార్మ్‌, తమ ప్రతి బ్యాచ్‌ పాలనూ విస్తృతశ్రేణిలో పరీక్షలు జరిపి ఎలాంటి కల్తీ, యాంటీబయాటిక్స్‌, హార్మోన్లు, రుచి, వాసన సంబంధిత అంశాలు జోడించలేదని నిర్ధారిస్తుంది. ప్రస్తుతం ఈ కంపెనీ తమ పాలు, పాల ఉత్పత్తులపై రోజుకు 2వేలకు పైగా పరీక్షలు జరిపి వినియోగదారులు అత్యుత్తమ శ్రేణిలోని ఉత్పత్తులు మాత్రమే అందుకుంటున్నారనే భరోసా అందిస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆంధ్రాలో రాత్రి కర్ఫ్యూ పొడగింపు