Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆన్‌లైన్‌ గివింగ్‌కు నూతన కోణం ఆవిష్కరిస్తూ షాప్‌ టు గివ్‌‌ను ప్రారంభించిన మిలాప్‌

Advertiesment
image
, శుక్రవారం, 21 అక్టోబరు 2022 (17:40 IST)
ఈ పండుగ సీజన్‌లో, భారతదేశపు మొట్టమొదటి జీరో-ఫీ క్రౌడ్‌ ఫండింగ్‌ వేదిక మిలాప్‌ డాట్‌ ఓఆర్‌జీ తమ తాజా ఆఫరింగ్‌ షాప్‌ టు గివ్‌ను ప్రారంభించింది. ఆన్‌లైన్‌ గివింగ్‌ను వైవిధ్యీకరించడంతో పాటుగా తమ ప్రయత్నాలను మెరుగ్గా కొనసాగించడంలో భాగంగా ఈ సౌకర్యం ప్రారంభించింది. ఈ కార్యక్రమం, దేశంలో క్రౌడ్‌ ఫండింగ్‌ ప్లాట్‌ఫామ్‌పై మొట్టమొదటిసారి. దీనిద్వారా వినియోగదారులు తమ అభిమాన ఈ-కామర్స్‌ బ్రాండ్స్‌ నుంచి కొనుగోలు చేయడంతో పాటుగా అదనంగా ఎలాంటి విరాళపు మొత్తం జోడించకుండానే ఓ మహోన్నత కారణం/ఫండ్‌ రైజర్‌కు విరాళం అందించవచ్చు.


ఈ పండుగ సీజన్‌లో  చేసే ప్రతి కొనుగోలుపై  ఈ బ్రాండ్లు, ఆర్డర్‌ వాల్యూపై తమ వాటాను కొనుగోలుదారులు ఎంచుకున్న కారణం/ఫండ్‌రైజర్‌కు అందిస్తారు. మిలాప్‌పై ఫండ్‌ రైజర్‌ ఆర్గనైజర్లు సైతం ఈ కార్యక్రమం ద్వారా అపూర్వంగా ప్రయోజనం పొందగలరు. తమ స్నేహితులు/కుటుంబసభ్యులను ఈ పండుగ సీజన్‌ అవసరాల కోసం  ఈ ప్లాట్‌ఫామ్‌పై ఆన్‌లైన్‌లో కొనుగోళ్లు జరిపేలా ప్రోత్సహించడం ద్వారా సంబంధిత ఫండ్‌రైజర్లకు సైతం ప్రయోజనం కలిగించవచ్చు.
 
తమ ఆన్‌లైన్‌ కొనుగోళ్ల కోసం ఎక్కువ మంది తరచుగా వినియోగించే, అత్యంత ప్రజాదరణ పొందిన బ్రాండ్లు అయిన మింత్రా, అజియో, నైకా, మేక్‌ మై ట్రిప్‌ మరియు మిలాప్‌పై షాప్‌ టు గివ్‌ కింద జాబితీకరించిన ఈ-కామర్స్‌  సంస్థల వద్ద ఈ ఫీచర్‌ లభ్యమవుతుంది. ఈ కార్యక్రమం, వినియోగదారులకు అదనపు ఖర్చు లేదంటే ప్రయత్నం లేకుండానే తక్షణ ప్రభావం చూపే అవకాశం అందిస్తుంది. అదనంగా, కొనుగోలుదారులు అన్ని రకాల రాయితీలూ, ఆఫర్లనూ బ్రాండ్ల నుంచి ఈ ప్లాట్‌ఫామ్‌ వినియోగించుకుని ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేసినప్పుడు పొందవచ్చు. ఈ-కామర్స్‌ ప్లాట్‌ఫామ్స్‌ కోసం ప్రత్యేకంగా తీర్చిదిద్దిన లింక్స్‌, స్వయంచాలకంగా  విరాళాలను ఆర్డర్‌ విలువ నుంచి విరాళాలను అందించడం వల్ల కొనుగోలుదారులకు అత్యంత ఆకర్షణీయమైన అనుభూతిగా మారుతుంది.
 
షాప్‌ టు గివ్‌ ఆలోచన మిలాప్‌కు ఏవిధంగా వచ్చిందనే అంశమై మిలాప్‌ కో-ఫౌండర్‌, అధ్యక్షుడు అనోజ్‌ విశ్వనాథన్‌ మాట్లాడుతూ, ‘‘మిలాప్‌ వద్ద, మేము స్ధిరంగా మా క్యాంపెయిన్‌ ఆర్గనైజర్లు విజయవంతంగా విరాళాలను సేకరించేందుకు తగిన అవకాశాలను అందించడానికి  కృషి చేస్తూనే ఉంటాము. షాప్‌ టు గివ్‌ ఆ ప్రయత్నాల నుంచి వచ్చినది. ఈ పండుగ సీజన్‌లో ఈ తరహా కార్యక్రమంతో వచ్చిన మొట్టమొదటి, ఒకే ఒక్క ప్లాట్‌ఫామ్‌గా నిలువడం పట్ల చాలా సంతోషంగా ఉంది’’అని అన్నారు.

 
మిలాప్‌పై ఫండ్‌ రైజింగ్‌ ప్రయత్నాలకు  షాప్‌ టు గివ్‌ ఏ విధంగా అదనపు విలువను అందించగలదనే అంశమై అనూజ్‌ మాట్లాడుతూ‘‘ తమ నెట్‌వర్క్‌ లోపల ప్రజలు పండుగ కొనుగోళ్లతో ప్రయోజనం పొందే అవకాశం క్యాంపెయిన్‌ ఆర్గనైజర్లకు షాప్‌ టు గివ్‌ అందిస్తుంది.  ప్రత్యక్ష విరాళాలను అడగడంకు బదులుగా వారు దాతలను పండుగ కొనుగోళ్లను తాము షేర్‌ చేసిన లింక్‌ ద్వారా కొనుగోలు చేసి తమ విరాళాన్ని అందించాల్సిందిగా కూడా కోరవచ్చు’’ అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పూర్తిగా కాలి బూడిదైన బస్సు.. ప్రయాణీకులు దిగేశారు.. కానీ..?