Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పూర్తిగా కాలి బూడిదైన బస్సు.. ప్రయాణీకులు దిగేశారు.. కానీ..?

RTC
, శుక్రవారం, 21 అక్టోబరు 2022 (16:38 IST)
RTC
ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. పూర్తిగా కాలి బూడిద అయ్యింది. కృష్ణా జిల్లా పెదపారుపూడి మండలం వెంట్రప్రగడ గ్రామం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. గుడివాడ నుంచి విజయవాడకు వెళ్తుండగా బస్సు ఇంజిన్ నుంచి మంటలు వచ్చాయి. దీన్ని గమనించిన డ్రైవర్ వెంటనే అప్రమత్తమయ్యాడు. 
 
బస్సును నిలిపేసి.. అందరూ దిగిపోవాలంటూ హెచ్చరించాడు. ఆ సమయంలో బస్సులో 60 మంది వరకు ప్రయాణికులు ఉన్నారు. వీరిలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు కూడా ఉన్నారు. డ్రైవర్ హెచ్చరికతో అందరూ బస్సు నుంచి వేగంగా దిగిపోయారు. దీంతో, పెను ప్రమాదం తప్పింది. 
 
మరోవైపు, ప్రాణభయంతో కంగారుగా బస్సు దిగే క్రమంలో తమ వస్తువులను చాలామంది బస్సులోనే వదిలేశారు. బంగారం, డబ్బు ఇవన్నీ బస్సుతో పాటే అగ్నికి ఆహుతి కావడంతో ప్రయాణీకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  ప్రమాదం గురించి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను ఆర్పివేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బీజేపీకి దాసోజు శ్రవణ్ రాజీనామా