Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అహ్మదాబాదులో తన తొలి ఎక్స్‎పీరియన్స్ హబ్‌ను ప్రారంభించిన మాటర్

Bike

ఐవీఆర్

, సోమవారం, 23 సెప్టెంబరు 2024 (21:40 IST)
భారతదేశాన్ని శక్తి స్వాతంత్ర్యం వైపుకు నడిపించడానికి నిబద్ధత కలిగిన వినూత్న ఈవి టెక్నాలజి, శక్తి నిల్వ సంస్థ అయిన మాటర్ గ్రూప్, అక్టోబరు 11, 2024 నాడు సందడిగా ఉండే నగరం అహ్మదాబాదులో తన మొట్టమొదటి ఎక్స్‎పీరియన్స్ హబ్ ప్రారంభాన్ని ప్రకటించింది. మాటర్ ఎక్స్‎పీరియన్స్ హబ్‌లో ఆధునిక సాంకేతికత, డిజైన్‌తో తయారుచేయబడిన ప్రత్యేక ఉత్పత్తి, రీటెయిల్, సంరక్షణ అనుభవాలు ఉంటాయి. ఇది భారతదేశములో ఎలెక్ట్రిక్ మొబిలిటిలో విప్లవాన్ని తీసుకొనివచ్చే మాటర్ ప్రయాణములో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుంది.
 
వ్యూహాత్మకంగా అహ్మదాబాదు నడిబొడ్డున ప్రారంభించబోయే ఈ మాటర్ ఎక్స్‎పీరియన్స్ హబ్ కేవలం ఒక రీటెయిల్ దుకాణము కాదు; ఇది వినియోగదారులకు, బైకింగ్ ఔత్సాహికులకు లీనమయ్యే అనుభవాన్ని అందించుటకు ఏర్పాటు చేయబడిన ఒక శక్తివంతమైన స్పేషియల్ రూపకల్పన. ఎక్స్‎పీరియన్స్ హబ్ యొక్క శిల్పకళ, లేఅవుట్ సందర్శకులకు ఎలెక్ట్రిక్ వాహన సాంకేతికతలో తాజా పురోగతుల గురించి తెలుసుకొనుటకు ఒక ప్రత్యేక అవకాశాన్ని అందిస్తూ, ఆవిష్కరణ మరియు సుస్థిరతల పట్ల మాటర్ యొక్క నిబద్ధతను ప్రతిబింబించుటకు ఏర్పాటుచేయబడింది. స్థిరమైన మొబిలిటిని ఎంచుకొనుటలో సహాయపడే లీనమయ్యే అనుభవాన్ని అందించడమే దీని ఉద్దేశం.
 
ఎక్స్‎పీరియన్స్ హబ్ లో సాంకేతికత మరియు జీవనశైలులను జాగ్రత్తగా కలిపే అంశాలు కలిగి ఉంటుంది. ఇందులో, పేరుగాంచిన భారతదేశపు మొట్టమొదటి గేర్డ్ ఎలెక్ట్రిక్ మోటార్‎బైక్ ను ప్రదర్శించే ఒక మాస్టర్ ఏఈఆర్‎ఏ డిస్ప్లే, ఆధునిక ఫీచర్స్ ను కనుగొనుటకు ఒక టెక్ డిస్ప్లే, ఇంటరాక్టివ్ ఫీచర్ ప్రదర్శనలు మరియు చలనశీలతను ప్రతిబింబించే విండో డిస్ప్లే ఉంటాయి. ఇందులో టెస్ట్ రైడ్స్, డెలివరీలు, చార్జింగ్ మరియు భౌతిక మరియు డిజిటల్ ఇంటరాక్షన్ ల నిరంతరాయ కలయిక అయిన ‘ఫిజిటల్’ అనుభవాల కొరకు కూడా ప్రత్యేక విభాగాలు ఉన్నాయి.
 
ఈ సందర్భంగా మాట్లాడుతూ, శ్రీ. మొహాల్ లాల్‎భాయ్, వ్యవస్థాపకుడు మరియు గ్రూప్ సీఈఓ, మాటర్ ఇలా అన్నారు, “అహ్మదాబాదులో మా మొట్టమొదటి ఎక్స్‎పీరియన్స్ హబ్ మాటర్ కొరకు ఒక ముఖ్యమైన అధ్యాయానికి ప్రారంభాన్ని సూచిస్తుంది. వినియోగదారులు మోటార్‎బైకింగ్ భవిష్యత్తును నిజంగా అనుభూతి చెందగలిగే ఒక ఎక్స్‎పీరియన్షియల్ హబ్ ను రూపొందించుటకు మేమెంతో సంతోషిస్తున్నాము. ఈ ప్రారంభముతో, మేము ఒక పరిశుభ్రమైన మరియు సుస్థిరమైన భవిష్యత్తు వైపుకు భారతదేశాన్ని నడిపించుటను మేము కొనసాగిస్తుండగా, మాటర్ ఒక పరివర్తనాత్మక మార్పు తీసుకొని వచ్చేందుకు మరియు ఈ-మొబిలిటి చరిత్రలో ఒక కొత్త మైలురాయిని సాధించుటకు సిద్ధం అవుతుంది.”

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రెచ్చిపోతున్న వీధి కుక్కలు.. చిన్నపిల్లాడిపై దాడి.. అమ్మ ఎలా కాపాడిందంటే? (Video)