Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హైదరాబాద్‌లో తమ మొట్టమొదటి ఈవీ చార్జింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ కేంద్రం ప్రారంభించిన లయన్‌ చార్జ్‌

image
, శుక్రవారం, 9 సెప్టెంబరు 2022 (17:51 IST)
ప్రపంచ ఈవీ దినోత్సవ వేళ భారతదేశంలో మొట్టమొదటి ఈవీ చార్జింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ కేంద్రాన్ని హైదరాబాద్‌లో అతి ముఖ్యమైన వాణిజ్య ప్రాంతం జూబ్లీహిల్స్‌లో ప్రారంభించించడం ద్వారా ఈవీ ప్రపంచంలోకి ప్రవేశిస్తున్నట్లు లయన్‌ చార్జ్‌ ఈవీ వెల్లడించింది. ఈ వినూత్నమైన ఈవీ చార్జింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ కేంద్రాన్ని తెలంగాణా రాష్ట్ర ప్రొహిబిషన్‌-ఎక్సైజ్‌, క్రీడలు, యువజన సేవలు, సాంస్కృతిక, ఆర్కియాలజీ శాఖామాత్యులె శ్రీ శ్రీనివాస్‌ గౌడ్‌, కొండగల్‌ ఎంఎల్‌ఏ శ్రీ పట్నం నరేందర్‌ రెడ్డి ప్రారంభించారు.
 
వృద్ధి చెందుతున్న ఈవీ కమ్యూనిటీకి మద్దతునందించేందుకు లయన్‌ చార్జ్‌ ఇప్పుడు భారతదేశపు మొట్టమొదటి ఈవీ చార్జింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ కేంద్రం-లయన్‌ చార్జ్‌ ఈవీ చార్జింగ్‌ హబ్‌ను ప్రారంభించింది. లయన్‌ చార్జ్‌  ఈవీ హబ్‌ వద్ద వినియోగదారులు 50 కిలోవాట్‌ ఈవీ చార్జింగ్‌ స్టేషన్‌ వద్ద తమ వాహనాలను చార్జ్‌ చేసుకోవచ్చు. తమ కారు చార్జ్‌ అయ్యే లోపు వారు అత్యంత ఆహ్లాదకరమైన లాంజ్‌లో సేద తీరుతూ కాఫీనీ  సేవించవచ్చు. ఈవీ చార్జింగ్‌  హబ్‌లో 5 చార్జర్లు ఉన్నాయి. ఇవి అన్ని రకాల నాలుగు చక్రాల వాహనాలు, మూడు చక్రాలు, ద్విచక్రవాహనాలకు మద్దతునందిస్తాయి. ఈ ఈవీ చార్జింగ్‌ హబ్‌లో 50కిలోవాట్‌ డీసీ చార్జర్‌ ఉంది. ఇది ఈవీని 50 నిమిషాల లోపు సమయంలోనే పూర్తిగా చార్జ్‌ చేస్తుంది. ఈవీ చార్జింగ్‌ హబ్‌లో 43కిలోవాట్‌ ఏసీ చార్జర్‌, 15 కిలోవాట్‌ జీబీ/టీ చార్జర్‌, మూడు 3కిలోవాట్‌ ఏసీ చార్జర్లు సైతం ఉన్నాయి.
 
‘‘ఈ చార్జింగ్‌ కేంద్రం, ఈవీ ప్రియులకు ఓ అవగాహన వేదికగా పనిచేయనుంది. ఈవీ విప్లవం, వాటి పనితీరు, బ్యాటరీ సాంకేతికతలను గురించి మరింతగా వీరు తెలుసుకోవచ్చు. ఈ ఎక్స్‌పీరియన్స్‌ కేంద్రం ప్రారంభించడానికి ప్రధాన కారణం వినియోగదారులకు అవగాహన మెరుగుపరచడం, ఈవీ చార్జింగ్‌ పట్ల ఉన్న అపోహలను పోగొట్టడం. అదే సమయంలో ఈవీ చార్జింగ్‌, సొంతం చేసుకోవడంలోని సౌకర్యం గురించి తెలపడం. ఈ ప్లాట్‌ఫామ్‌ యువ ఔత్సాహిక వేత్తలకు  మీటప్‌ కేంద్రంగా కూడా నిలువడంతో  పాటుగా వారి ఆలోచనలను పంచుకునే వేదికగా కూడా నిలుస్తుంది’’ అని లయన్‌ చార్జ్‌  ఫౌండర్‌, సీఈఓ- మేనేజింగ్‌ డైరెక్టర్‌, గుత్తా వెంకట సాయివీర్‌ రెడ్డి అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమరావతి దెయ్యాల రాజధాని.. సెలవిచ్చిన ఏపీ వైకాపా మంత్రి