Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

టెక్స్‌టైల్స్‌ రంగంలోకి అడుగుపెట్టిన ప్రముఖ అంతర్జాతీయ వ్యూహాత్మక పెట్టుబడిదారు టిసిజి

Yarn

ఐవీఆర్

, బుధవారం, 14 ఫిబ్రవరి 2024 (23:10 IST)
గార్డెన్ సిల్క్ మిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ వద్ద రూ. 1,250 కోట్ల FDY నూలు విస్తరణ ప్రాజెక్ట్, దాని దూరదృష్టిగల ఛైర్మన్, డాక్టర్ పూర్ణేందు ఛటర్జీ నాయకత్వంలో ద ఛటర్జీ గ్రూప్ (టిసిజి ) వస్త్ర రంగంలో వేగవంతమైన పురోగతికి నాంది పలికింది. జోల్వాలో ఉన్న అత్యాధునిక తయారీ ప్లాంట్‌తో, అధిక నాణ్యత గల పాలిస్టర్ చిప్స్, POY, FDY ఇతర ప్రత్యేక నూలులను ఉత్పత్తి చేస్తుంది. ఐకానిక్ గార్డెన్ వరేలీ బ్రాండ్ చీరలు, దుస్తుల సామగ్రి యొక్క సమకాలీన కలెక్షన్ ను  కలిగి ఉంది, ఛటర్జీ గ్రూప్, ప్రపంచవ్యాప్తంగా USD 8 బిలియన్ల పెట్టుబడులు పెట్టడంతో పాటుగా నిజంగా రేపటి గార్డెన్‌ను  సృష్టిస్తుంది. 
 
"MCPI, GSMPL వద్ద మేము టిసిజి ఛైర్మన్ డాక్టర్ పూర్ణేందు ఛటర్జీ యొక్క బలమైన వస్త్ర లక్ష్యంని సాకారం చేయటానికి కట్టుబడి ఉన్నాము." అని  డి.పి.పాత్ర, హోల్ టైమ్ డైరెక్టర్ మరియు సిఇఒ, MCPI అన్నారు. టెక్స్‌టైల్స్‌ రంగంలోకి ఈ ప్రవేశంతో, టిసిజి రాబోయే సంవత్సరాల్లో PTA-పాలిస్టర్ డౌన్‌స్ట్రీమ్ సెగ్మెంట్‌లో కీలక పాత్ర పోషించాలని లక్ష్యంగా పెట్టుకుంది. టెక్స్‌టైల్స్‌ రంగంలో విపరీతమైన వృద్ధిని సాధించాలనే టిసిజి లక్ష్యంకి అనుగుణంగా, GSMPL, MCPI రెండూ రాబోయే సంవత్సరాల్లో వివిధ పాలిస్టర్ విభాగాలలో దాని కార్యకలాపాలను పెంచాలని చూస్తున్నాయి. GSMPL యొక్క నూలు వ్యాపారానికి మద్దతు ఇవ్వడానికి సరసమైన ధరలకు మంచి నాణ్యత గల PTAని MCPI సరఫరా చేస్తూనే ఉంది, యార్న్ వ్యాపారం ప్రస్తుతం పరిశ్రమకు తీవ్ర తిరోగమనం దిశలో ఉంది. నూతన FDY నూలు సౌకర్యాలలో భారీ  పెట్టుబడులు, వ్యాపార కార్యకలాపాలను మెరుగుపరచడానికి ప్లాంట్‌కు 220 KVA విద్యుత్ కనెక్షన్ అందించబడ్డాయి. అదనంగా, కంపెనీ మొత్తం కార్బన్ పాదముద్రను తగ్గించడానికి హైబ్రిడ్ పునరుత్పాదక శక్తిలో పెట్టుబడి పెట్టింది. పునరుత్పాదక శక్తిలో మరింత మెరుగుదల జరుగుతోంది.
 
ఈరోజు GSMPL రోజుకు 272 టన్నుల సామర్థ్యం కలిగిన ఫుల్లీ డ్రాన్ యార్న్ (FDY) ప్లాంట్‌ను విజయవంతంగా ప్రారంభించినందుకు గర్వంగా ఉంది. స్టేట్-ఆఫ్-ది-ఆర్ట్ ఓర్లికాన్ బార్‌మాగ్ వింగ్స్+ మెషీన్‌లు అల్లడం, నేయడం, సైజింగ్ అప్లికేషన్‌ల కోసం 'బెస్ట్ ఇన్ క్లాస్' FDYని ఉత్పత్తి చేస్తాయి. భవిష్యత్తులో వివిధ ప్రదేశాలలో పారిశ్రామిక నూలు, జియోటెక్స్‌టైల్ సౌకర్యాలను ఏర్పాటు చేయాలని కంపెనీ యోచిస్తోంది. డా. పూర్ణేందు ఛటర్జీ యొక్క దార్శనికత, నాయకత్వం టిసిజి యొక్క విభిన్న పోర్ట్‌ఫోలియోకు దారితీసింది, ఇది వ్యాపార పరంగా ప్రపంచ వ్యాప్తంగా కార్యకలాపాలు నిర్వహిస్తుంది. USA, యూరప్, దక్షిణాసియాలో సుమారు 8 బిలియన్ల యుఎస్ డాలర్ పెట్టుబడితో వ్యూహాత్మక పెట్టుబడిదారుగా ఆశించదగిన ట్రాక్ రికార్డ్ కలిగి ఉంది. పెట్రోకెమికల్స్, లైఫ్ సైన్సెస్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, రియల్ ఎస్టేట్, కెమికల్ కంపెనీలకు సాంకేతికత, ఫిన్-టెక్, మరెన్నో వ్యాపార రంగాలలో కార్యకలాపాలు నిర్వహిస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అన్నాడీఎంకే తీర్థం పుచ్చుకున్న సినీనటి గౌతమి