లాల్ దర్వాజా బోనాల జాతరకు సమయం ఆసన్నమైంది. జూలై 16, 17వ తేదీల్లో రెండు రోజులపాటు అమ్మవారికి బోనాల సమర్పించుకోవడంతోపాటు, ఘటాల ఊరేగింపు, తొట్టెల జాతర, పలారం బండ్ల ఊరేగింపు జరుగుతాయి. ఈ సందర్భంగా సర్కారు తరపున మంత్రి తలసాని పట్టువస్త్రాలు సమర్పిస్తారు.
ఆదివారం తెల్లవారుజామునుంచే భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించుకుంటారు. బోనాల సందర్భంగా వారం రోజుల నుండి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. శుక్రవారం రాత్రి అమ్మవారికి మహా హారతి నిర్వహించడం జరిగింది. ఇక ఈ వచ్చే ఆదివారం లాల్ దర్వాజాలో బోనాల జాతరతో ఈ పండుగ ముగియనుంది.
లాల్ దర్వాజ బోనాలు నిజాంల కాలంలోనే సంప్రదాయంగా ప్రారంభమయ్యాయి. ఈ బోనాలు 115 సంవత్సరాలుగా జరుగుతున్నాయి.