Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తెలంగాణలోని కరీంనగర్‌లో కొత్త డీలర్‌షిప్‌ను ప్రారంభించిన కైనెటిక్ గ్రీన్

Advertiesment
Kinetic Green

ఐవీఆర్

, బుధవారం, 16 ఏప్రియల్ 2025 (21:44 IST)
కరీంనగర్: కైనెటిక్ గ్రీన్ ఎనర్జీ అండ్ పవర్ లిమిటెడ్ సొల్యూషన్స్, భారతదేశంలోని ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర - త్రిచక్ర వాహనాల తయారీ సంస్థ, తెలంగాణలోని కరీంనగర్‌లో తన కొత్త ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల డీలర్‌షిప్- రామ ఎలక్ట్రిక్ మొబిలిటీ LLPను ప్రారంభిస్తున్నట్లు గర్వంగా ప్రకటించింది. కొత్త డీలర్‌షిప్ కరీంనగర్‌ నగరంలోని అల్గునూరు హైదరాబాద్ రోడ్డులో ఉంది. ఈ ప్రారంభోత్సవం, తెలంగాణలో కైనెటిక్ గ్రీన్ తన ఉనికిని విస్తరించేందుకు తీసుకున్న మరో కీలక అడుగు కాగా, బ్రాండ్ యొక్క గ్రీన్ మొబిలిటీ దిశగా ఉన్న దృఢమైన నిబద్ధతకు నిదర్శనంగా నిలుస్తోంది.
 
ఈ డీలర్‌షిప్‌ను మిస్టర్. పంకజ్ శర్మ, 2-వీలర్ బిజినెస్ ప్రెసిడెంట్, కైనెటిక్ గ్రీన్ ప్రారంభించారు. ఈ ప్రారంభ కార్యక్రమానికి 200 మందికి పైగా వినియోగదారులు హాజరయ్యారు. కార్యక్రమంలో కైనెటిక్ గ్రీన్ బృందం, ప్రభుత్వ అధికారులు, ఒపీనియన్ లీడర్లు, స్థానిక వినియోగదారులు పాల్గొన్నారు. వారు వాతావరణ మార్పులు, పెరుగుతున్న కాలుష్యం వంటి గ్లోబల్ సమస్యలపై చర్చించి, ఎలక్ట్రిక్ వాహనాలు (EVలు) ఆ సమస్యల పరిష్కారంలో పోషించే కీలక పాత్రపై దృష్టి సారించారు. కేవలం పరిసరాల సంరక్షణే కాదు, భవిష్యత్ తరాల కోసం స్థిరమైన మరియు శుద్ధమైన మొబిలిటీ పరిష్కారాల అవశ్యకతను కూడా హాజరైన ప్రతినిధులు ప్రస్తావించారు.
 
కైనెటిక్ గ్రీన్ యొక్క కొత్త డీలర్షిప్ 3S (సేల్స్, సర్వీస్, & స్పేర్ పార్ట్స్)సౌకర్యం, భారతీయ వినియోగదారుల నిర్దిష్ట అవసరాలను తీర్చడానికి రూపొందించిన కైనెటిక్ గ్రీన్ యొక్క విభిన్న శ్రేణి ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలైన ఇ-లూనా, ఇ-జులు మరియు జింగ్‌లను గర్వంగా ప్రదర్శిస్తుంది. ఈ మోడల్‌లు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో స్థిరత్వాన్ని సజావుగా మిళితం చేస్తాయి, స్మార్ట్, పదునైన మరియు సొగసైన డిజైన్లను అద్భుతమైన ఫీచర్లుగా అందిస్తాయి.
 
డీలర్‌షిప్ విస్తరణపై మాట్లాడుతూ, మిస్టర్ పంకజ్ శర్మ, ప్రెసిడెంట్ 2-వీలర్ బిజినెస్, కైనెటిక్ గ్రీన్ అని అన్నారు, "తెలంగాణలో మా అడుగుజాడలను విస్తరించడంలో మరో కీలక దశగా, కరీంనగర్‌లో మా కొత్త డీలర్‌షిప్‌ను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించడంలో మాకు అత్యంత ఆనందంగా ఉంది. ఈ మైలురాయి, భారతదేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ మొబిలిటీని మరింత అందుబాటులోకి తెచ్చి, ప్రధాన స్రవంతిగా మార్చేందుకు మా నిరంతర నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. మా అంకితమైన షోరూమ్ బృందం వినియోగదారులకు నిపుణుల మార్గదర్శకత్వాన్ని అందిస్తూ, వారు సజావుగా కొనుగోలు చేయడంలో, విశ్వసనీయమైన సేవలను పొందడంలో, సమాచారం ఆధారిత నిర్ణయాలను తీసుకోవడంలో పూర్తి సహాయాన్ని అందించేందుకు కట్టుబడి ఉంది.”
 
దీనికి జత చేస్తూ, మిస్టర్. రామ్ రాహుల్ బజాజ్, పార్ట్‌నర్స్, రామ ఎలక్ట్రిక్ మొబిలిటీ LLP ఇలా అన్నారు, “కైనెటిక్ గ్రీన్‌తో భాగస్వామ్యం కావడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. వారు మాపై చూపిన మద్దతు, విశ్వాసానికి మేము హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. వినియోగదారులు సమాచారం ఆధారంగా సరైన నిర్ణయాలు తీసుకునేలా చేయడంలో, ప్రపంచ స్థాయి సేవలతో పాటు నిపుణుల మార్గదర్శకత్వాన్ని అందించడం మా ప్రధాన లక్ష్యం. EV మార్కెట్ వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రస్తుత సమయంలో, కరీంనగర్‌లో పర్యావరణ హిత రవాణా పరిష్కారాలను ప్రోత్సహించడంలో ఈ డీలర్‌షిప్ కీలక పాత్ర పోషిస్తుందని మేము గట్టిగా విశ్వసిస్తున్నాము,” అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నా భార్యతో విడాకులు ఇప్పించండి.. ఒమర్ : కూర్చొని మాట్లాడుకోండి.. సుప్రీం