Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

విశాఖలో అసాధారణ మొబైల్ నెట్‌వర్క్‌తో మెరిసిన జియో

Advertiesment
jio

ఐవీఆర్

, బుధవారం, 16 జులై 2025 (22:14 IST)
విశాఖపట్నం: రిలయన్స్ జియో విశాఖపట్నంలో అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న టెలికాం ఆపరేటర్‌గా అవతరించింది. కీలకమైన వాయిస్, డేటా పనితీరులో ఇతర టెల్కోలను జియో వెనక్కి నెట్టింది. నగరంలో ఇటీవల TRAI నిర్వహించిన ఇండిపెండెంట్ డ్రైవ్ టెస్ట్‌లో జియో తన బలమైన మొబైల్ నెట్‌వర్క్ సామర్ధ్యాన్ని నిరూపించుకుంది. మిలియన్ల మంది వినియోగదారులకు అత్యుత్తమ డిజిటల్ సేవలను అందించడంలో తన ప్రత్యేకతను మరోసారి చాటుకుంది. 
 
ట్రాయ్ నివేదిక ప్రకారం రిలయన్స్ జియో తన 4G నెట్‌వర్క్‌లో 204.91 Mbps సగటు డౌన్‌లోడ్ వేగాన్ని నమోదు చేసింది. ఇది నగరంలోని అన్ని ఆపరేటర్లలో అత్యధికం. ఈ అసాధారణ పనితీరు వల్ల జియో కస్టమర్‌లు గరిష్ట వినియోగ సమయాల్లో కూడా వేగవంతమైన వీడియో స్ట్రీమింగ్, ఆన్‌లైన్ గేమింగ్, వేగవంతమైన యాప్ డౌన్‌లోడ్‌లు, అంతరాయం లేని బ్రౌజింగ్‌ను ఆస్వాదించేలా చేస్తుంది.
 
ఈ ఫలితాలు..  జియోను అధిక డౌన్‌లింక్ వేగం, తక్కువ లేటెన్సీ కలిగిన ఉత్తమ నెట్‌వర్క్‌గా నిలబెట్టాయి. అతి తక్కువ లేటెన్సీ వినియోగదారులు, సర్వర్‌ల మధ్య డేటా ప్యాకెట్‌లు ప్రయాణించడానికి పట్టే సమయాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. ఇది వీడియో కాన్ఫరెన్సింగ్, ఆన్‌లైన్ గేమింగ్ వంటి రియల్-టైమ్ అప్లికేషన్‌లకు అత్యంత అవసరం. 
 
మరోవైపు వాయిస్ సేవలలో కూడా జియో పనితీరు అంతే బలంగా ఉంది. జియో సేవలు అధిక కాల్ సెటప్ సక్సెస్ రేటు, తక్కువ కాల్ సెటప్ సమయం, జీరో కాల్ డ్రాప్ రేటు, అద్భుతమైన వాయిస్ స్పష్టత అందిస్తున్నాయని ట్రాయ్ నివేదిక సూచిస్తోంది. విశాఖపట్నం అంతటా విస్తృత ప్రాంతాన్ని కవర్ చేసిన ఈ డ్రైవ్ టెస్ట్ ఫలితాలు జియోను అత్యుత్తమ ఆపరేటర్‌గా నిలబెట్టాయి. హై-డెఫినిషన్ కంటెంట్‌ను స్ట్రీమింగ్ చేసినా, HD-నాణ్యత వాయిస్ కాల్‌లు చేసినా లేదా రియల్-టైమ్ అప్లికేషన్‌లను యాక్సెస్ చేసినా, ఆంధ్రప్రదేశ్ లోని మొబైల్ వినియోగదారులకు బెస్ట్ చాయిస్‌గా జియో ముందంజలో ఉంటుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ నీటి పంపకాలు... సీఎంల భేటీ సక్సెస్..