Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చిన్నారులలో రోగ నిరోధక శక్తి: ముల్మినాపై జరిపిన క్లీనికల్‌ అధ్యయన ఫలితాలను వెల్లడించిన జగ్దాలె హెల్త్‌కేర్‌

Advertiesment
Jagdale Healthcare
, శనివారం, 18 సెప్టెంబరు 2021 (22:21 IST)
జగ్దాలె ఇండస్ట్రీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌  విభాగమైన జగ్గాలె హెల్త్‌కేర్‌ ఇటీవలనే తమ అత్యంత ప్రాచుర్యం పొందిన హెల్త్‌ డ్రింక్‌ ముల్మినాపై నిర్వహించిన క్లీనికల్‌ అధ్యయన ఫలితాలను వెల్లడించింది. చిన్నారులతో సహా అన్ని వయసు తరగతులకు చెందిన వ్యక్తులు సేవించడానికి అత్యంత అనుకూలమైనది ఇది. ముల్మినాలో సహజసిద్ధమైన సూపర్‌ ఫుడ్స్‌ ఉన్నాయి. 
 
ఇప్పుడు టెట్రా ప్యాక్‌లో అందుబాటులో ఉన్న ఒకే ఒక్క ఇమ్యూన్‌ బూస్టర్‌, యాంటీ ఆక్సిడెంట్‌ రెడీ టు డ్రింక్‌, ముల్మినా. ఈ అధ్యయన ఫలితాలు వెల్లడించే దాని ప్రకారం, ఈ డ్రింక్‌లో అంతర్లీనంగా దాగిన రోగనిరోధక శక్తిని పెంపొందించే లక్షణాలు, ఇతర ఆరోగ్యవంతమైన పానీయాలకు ప్రత్యామ్నాయంగా నిలుపుతుంది.
 
ప్రస్తుత మహమ్మారి నేపథ్యంలో, అధిక శాతం మంది ప్రజలు నివారణ ఆరోగ్యం కోసం అందుబాటులోని అత్యుత్తమ  అవకాశాల కోసం వెదుకుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న కోవిడ్‌ కేసులతో, ప్రపంచ వ్యాప్తంగా ఈ వ్యాధి కోసం ఆధారపడతగిన మరియు చికిత్సావకాశాలను హెల్త్‌కేర్‌ కంపెనీలు అన్వేషిస్తున్నాయి. దురదృష్టవశాత్తు, ఎంతోమంది రోగులు తమ పిల్లలు కరోనా వైరస్‌ బారిన ఎక్కడ పడతారో అనే ఆందోళనతో కనీస ఆరోగ్య సంరక్షణ ప్రొటోకాల్స్‌ అనుసరించడానికి ఆలస్యం చేయడం లేదా దాటవేయడం వల్ల తమ పిల్లలను అంటువ్యాధుల ప్రమాదానికి దగ్గర చేస్తున్నారు.
 
ఆయుర్వేదిక ఔషధాలు అయినటువంటి పసుపు, గొటు కోలా వంటి వాటిని మామిడితో కలిపి వినియోగించడం వల్ల కలిగే ప్రయోజనాలను గురించి చెప్పబడినది. ఇప్పుడు క్లీనికల్‌గా 7-14 సంవత్సరాల వయసు కలిగిన పిల్లల్లో రోగనిరోధక శక్తి మెరుగుపరచడంలో ఖచ్చితమైన పాత్రను ఇవి పోషిస్తాయని నిరూపించబడింది.
 
డాక్టర్‌ సౌమ్య నాగరాజన్‌, కన్సల్టెంట్‌ పిడియాట్రిషియన్‌, మల్లిగె హాస్పిటల్‌, బెంగళూరు మాట్లాడుతూ, ‘‘ఈ అధ్యయనం నిరూపించిన దాని ప్రకారం, మామిడి, గోటు కోలా మరియు పసుపులను అత్యవసర విటమిన్స్‌, మినరల్స్‌‌తో కలిపి ఎంపిక చేసిన శ్వాససంబంధిత వ్యాధులతో బాధపడుతున్న రోగులలో యాంటీబయాటిక్స్‌కు అనుబంధంగా వినియోగించిన ఎడల వారిలో రోగ నిరోధక శక్తి మరియు యాంటీ ఆక్సిడెంట్‌ స్థాయిలు పెరుగుతున్నాయని రక్త నమూనాల విశ్లేషణలో నిరూపితమైనది. ఇది చికిత్సలో న్యూట్రాస్యూటికల్‌ ఉత్పత్తులు ఏవిధంగా అనుబంధంగా ఉపయోగపడతాయనేది మరింతగా తెలుసుకునేందుకు ఓ మార్గాన్ని కూడా అందిస్తుంది’’ అని అన్నారు.
 
ఈ క్లీనికల్‌ అధ్యయనాలను శ్వాస సంబంధిత వ్యాధులతో ఇబ్బంది పడుతున్న చిన్నారులకు ముల్మినా మ్యాంగో  (మామిడి, గోటు కోలా/సెంటెల్లా ఆసియాటికా మరియు పసుపు సమ్మేళనం)తో పాటుగా ప్రామాణిక చికిత్సా మార్గదర్శకాలను అనుసరిస్తూ సుప్రసిద్ధ మెడికల్‌ ఇనిస్టిట్యూట్‌ మరియు పరిశోధనా కేంద్రం ఈ అధ్యయనం చేసింది. ఈ ఫలితాలు వెల్లడించిన దాని ప్రకారం 14 నుంచి 28 రోజుల కాలంలో యాంటీ ఆక్సిడెంట్‌ మార్కర్లు మరియు రోగ నిరోధకశక్తి కూడా ఈ చిన్నారులలో పెరిగినట్లు కనుగొనడం జరిగింది. అదనంగా, ఈ అధ్యయనాలు వెల్లడించే దాని ప్రకారం, ఇన్‌ఫ్లెమ్మటరీ మార్కర్లు అయిన సీ-రియాక్టివ్‌ ప్రొటీన్‌(సీఆర్‌పీ) తగ్గింది మరియు టోటల్‌ యాంటీ ఆక్సిడెంట్‌ సామర్థ్యం వృద్ధి చెందడం గమనించడం జరిగింది.
 
జగ్దాలె ఇండస్ట్రీట్‌, ఇండియా ఛైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌  రాజేష్‌ జగ్దాలె మాట్లాడుతూ, ‘‘ప్రపంచ శ్రేణి, శాస్త్రీయంగా నిరూపితమైన ఉత్పత్తులను అందించడాన్ని మేము విశ్వసిస్తుంటాము. ఇవి క్లినికల్‌గా నిరూపితం కావడంతో పాటుగా ప్రజల సాధారణ జీవనశైలిలో స్వీకరించతగిన రీతిలో ఉంటాయి. వాస్తవిక విజ్ఞానాన్ని తప్పనిసరిగా ప్రజలందరి ప్రయోజనాల కోసం పంచుకోవాలి’’ అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Fiber Net Scam: IRS అధికారి సాంబశివరావు అరెస్ట్‌