భారత రైల్వే సౌత్ జోన్‌లో పనిచేసేందుకు ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC), 9 కంప్యూటర్ ఆపరేటర్, ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు కనీసం 50 శాతం మార్కులతో పదో తరగతి లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
పదో తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. అర్హత సాధించినవారు తమిళనాడు జోన్‌లో పనిచేయాల్సి ఉంటుంది. ఏడాది పాటు ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్ సమయంలో నెలకు రూ.5,000ల నుంచి రూ.9,000ల వరకు స్టైపెండ్ చెల్లిస్తారు.
అలాగే సీవోపీఏ ట్రేడ్‌లో ఐటీఐ సర్టిఫికేట్ కూడా ఉండాలి. దరఖాస్తుదారుల వయసు కచ్చితంగా 16 నుంచి 25 యేళ్ల మధ్య ఉండాలి. ఆసక్తి కలిగిన వారు ఆగస్టు 30, 2022వ తేదీ లోపు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.