Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తమ 150వ స్టోర్‌ ప్రారంభోత్సవ మైలురాయిని వేడుక చేస్తోన్న సోచ్‌

Advertiesment
soch
, సోమవారం, 22 ఆగస్టు 2022 (23:45 IST)
గత 16 సంవత్సరాలుగా భారతీయ ఎథ్నిక్‌ వస్త్ర అవసరాలను తీర్చడంలో అగ్రగామిగా వెలుగొందుతున్న సోచ్‌, తమ 150వ స్టోర్‌ను ఆగస్టు 15, 2022న ప్రారంభించింది. ఈ స్టోర్‌ బెంగళూరులో ఉన్నప్పటికీ, వేడుకలు మాత్రం దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం 59 నగరాలలో సోచ్‌ కార్యకలాపాలు నిర్వహిస్తోంది.
 
ఏదైనా సోచ్‌ స్టోర్‌ను సందర్శించడం ద్వారా 10వేల రూపాయల విలువైన ఓచర్లను పొందవచ్చు. దేశవ్యాప్తంగా తమ ఔట్‌లెట్లులో అత్యాధునిక డిజైన్లు అందుబాటులో ఉన్నాయి. వీటన్నిటినీ అత్యద్భుతమైన వస్త్రాలతో డిజైన్‌ చేశారు. ఇవి చూడగానే ఆకట్టుకునే సిల్‌హ్యుటీలు, ఆహ్లాదకరమైన రంగులలో లభ్యమవుతాయి. వినియోగదారుల ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని ఈ నూతన కలెక్షన్స్‌ తీర్చిదిద్దారు. నేటి ధోరణులకు తగినట్లుగా ఉండటంతో పాటుగా వైవిధ్యమైన డిజైన్లలో ఉంటాయి.
 
ఈ మైలురాయి చేరుకోవడంపై సోచ్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌- సీఈఓ వినయ్‌ చిట్లానీ మాట్లాడుతూ, ‘‘ఎంతోకాలంగా ఈ మైలురాయి చేరుకోవడం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము. ఓ బ్రాండ్‌గా ఇది తమకు అతి ముఖ్యమైన ల్యాండ్‌మార్క్‌. దేశవ్యాప్తంగా తమ కార్యకలాపాలు నిర్వహించడంతో పాటుగా ఫ్యాషన్‌ పరిశ్రమలో వేడుక చేసుకోతగిన మైలురాయిని చేరుకున్నాము. తమ కథ బెంగళూరులో ప్రారంభమైంది. అందువల్ల 150వ స్టోర్‌ ఇక్కడ ప్రారంభించడమూ జరిగింది. ఓ ఫ్రాంచైజీగా తాము విస్తరిస్తోన్న కొద్దీ తమ వినియోగదారులకు అత్యుత్తమ ఎథ్నిక్‌ వేర్‌, సంతృప్తిని అందిస్తూనే ఉంటాము’’ అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మనిషికి సిగ్గుండాలి.. ఛి..ఛి.. వీళ్ళా తెలుగు ఆత్మగౌరవాన్ని కాపాడేది..? (video)