Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రపంచ డిమాండ్‌ను తీర్చనున్న భారతదేశంలోని శ్రామిక శక్తి: కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్

Advertiesment
image

ఐవీఆర్

, శుక్రవారం, 16 ఫిబ్రవరి 2024 (19:55 IST)
స్కిల్ డెవలప్‌మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (NSDC) గౌరవనీయులైన మన దేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇచ్చిన వికాస్ భారత్ పిలుపుతో 2047 నాటికి మన దేశాన్ని స్కిల్ డెవలప్మెంట్‌లో మరింత వృద్ధి సాధించే దిశగా దూసుకెళ్తున్నాయి. అందులో భాగంగా.. 15 ప్రసిద్ధ సంస్థలు, పరిశ్రమ దిగ్గజాలు, ప్రముఖ విద్యాసంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి MSDE మరియు NSDC. దీనిద్వారా రాబోయే రోజుల్లో స్కిల్ డెవలప్మెంట్ కోసం అమృత్ పీఠిని ఏర్పాటు చేస్తాయి. ఇందులో భాగంగా ఫ్లిప్ కార్డ్, టీమ్ లీజ్, ఇన్ఫోసిస్, ఐఐటీ గౌహతి అండ్ లాజిక్ నాట్స్, టైమ్స్ ప్రో, బీసీజీ, గూగుల్, అప్ గ్రాడ్, అన్ స్టాప్, మైక్రోసాఫ్ట్, M3M ఫౌండేషన్, రిలయన్స్ ఫౌండేషన్, యస్ ఫౌండేషన్ UPS మరియు టైమ్ లీజ్ ఎడ్ టెక్ లాంటి దిగ్గజాలతో భాగస్వామ్యాలు ప్రకటించబడ్డాయి.
 
ఈ అద్బుతమైన కార్యక్రమంలో కేంద్ర విద్య- నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత మంత్రి వర్యులు శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ గారు, గౌరవనీయులైన కేంద్ర విద్య మరియు శ్రీ. అతుల్ కుమార్ తివారీ, కార్యదర్శి, MSDE; డా.నిర్మల్‌జీత్ సింగ్ కల్సి, చైర్‌పర్సన్, NCVET, శ్రీమతి త్రిషల్జిత్ సేథి, డైరెక్టర్ జనరల్(శిక్షణ), DGT, శ్రీ. ఈ కార్యక్రమంలో NSDC CEO, NSDC ఇంటర్నేషనల్ MD వేద్ మణి తివారీ ప్రసంగించారు.
 
నైపుణ్యాలనకు సంబంధించిన ఎకో సిస్టమ్‌ను మరింతగా అందుబాటులోకి తేవాలని, అంతేకాకుండా ఆ నేర్చుకున్న నైపుణ్యాలను వినూత్నంగా, అందరికి ఉపయోపడే విధానంపై దృష్టి సారిస్తూ, ఈ భాగస్వామ్యాలు విద్య, పరిశ్రమ-విద్యా సంబంధ అనుసంధానాలలో కొత్త శకానికి నాంది పలికాయి. ఈ సహాయ సహకారాల ద్వారా, భారతదేశ యువత పరిశ్రమల్లో సరైన ఉపాధి అవకాశాలను పొందుతారు. ఈ భాగస్వామ్యం అభ్యాస ఫలితాలను బలోపేతం చేయడానికి, డిజిటల్ ఆర్థిక వ్యవస్థను నిర్మించడానికి మరియు విద్యను పెంపొందించడానికి G20 ఫ్రేమ్‌వర్క్‌ లో పేర్కొన్న లక్ష్యాలకు అనుగుణంగా ఉంటాయి.
 
ఈ సందర్భంగా కేంద్ర విద్య నైపుణ్యాభివృద్ధి మరియు వ్యవస్థాపకత మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ గారు మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ... “భారతదేశ యువశక్తికి నైపుణ్యం, సాధికారత కోసం అనేక కార్యక్రమాలు, పరిశ్రమ భాగస్వామ్యాలను ప్రారంభించడం మాకు సంతోషంగా ఉంది. గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫ్లిప్‌కార్ట్, టీమ్‌లీజ్, అప్‌గ్రాడ్, రిలయన్స్ ఫౌండేషన్ వంటి మరిన్ని సంస్థలతో ఇవాళ ఏర్పడిన ఈ భాగస్వామ్యాలు స్కిల్ ఇండియా మిషన్‌ను మరింత ముందుకు నడిపిస్తాయి. అంతేకాకుండా ప్రపంచ అవకాశాలను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్న సమర్ధవంతమైన, ఉత్పాదక, సమర్థవంతమైన వర్క్‌ఫోర్స్‌‌ను నిర్మిస్తాయి.  
 
ఈ కార్యక్రమం సందర్భంగా పరిశ్రమల ప్రతినిధులు కేంద్రం మంత్రి, కార్యదర్శితో చర్చలు జరిపారు. వారివారి అభిప్రాయాలను తెలియచేశారు. కేంద్ర మంత్రి, సెక్రటరీ ఇచ్చిన విలువైన సలహాలను సూచలను విన్నారు. భారతదేశ యువత సామర్థ్యాలను పెంపొందించడానికి వినూత్న వ్యూహాలను చర్చించి, రాబోయే రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా మన వర్క్ ఫోర్స్ ఎలా ఉపయోగపడోలో నిర్ధారించుకున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాహుల్ యాత్ర: అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన ప్రియాంకా గాంధీ..