టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ఏ వ్యక్తి ఆర్థిక ప్రణాళికలోనైనా ముఖ్యమైన భాగం. సంపాదిస్తున్న సభ్యుడు మరణిస్తే కుటుంబానికి ఆదాయ ప్రత్యామ్నాయ సాధనంగా వ్యవహరించడం ద్వారా ఇది బలమైన పునాదిని అందిస్తుంది, ఆర్థిక లక్ష్యాలు ఇప్పటికీ సాధించగలవని నిర్ధారిస్తుంది. ఇటీవల, భారత ప్రభుత్వం అన్ని బీమా పాలసీలను జిఎస్టి నుండి మినహాయించే సంస్కరణలను ప్రవేశపెట్టింది. వినియోగదారులు గతంలో ప్రీమియం మొత్తంలో 18% జిఎస్టి గా చెల్లించారు, ఉదాహరణకు, ఒక వ్యక్తి రూ. 100 ప్రీమియం చెల్లించాల్సి వస్తే, దీనికి మించి రూ. 18 GSTగా వసూలు చేయబడింది. జిఎస్టి మినహాయింపుతో వ్యక్తి ఇప్పుడు రూ. 100 మాత్రమే చెల్లించాలి. ఇది టర్మ్ ఇన్సూరెన్స్ ఉత్పత్తులతో సహా జీవిత బీమా ఉత్పత్తులను చౌకగా చేసింది.
ప్రత్యేకంగా, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ తన కస్టమర్లకు ఉత్తమ విలువను అందించడంలో నిబద్ధతకు అనుగుణంగా మొత్తం జిఎస్టి మినహాయింపు ప్రయోజనాన్ని దాని కస్టమర్లకు అందించింది. బీమా పథకాలను మరింత సరసమైనదిగా, ప్రతి భారతీయ కుటుంబానికి అందుబాటులోకి తీసుకురావడం చేసింది.
టర్మ్ ఇన్సూరెన్స్ ఉత్పత్తుల ధరలపై దీని ప్రభావం ఏమిటో ఒకసారి పరిశీలిద్దాం. గతంలో, 30 ఏళ్ల ధూమపానం చేయని పురుషుడు ఒక కోటి భీమా కోసం నెలకు రూ. 825 ప్రీమియం చెల్లించాడు, ఇందులో జిఎస్టి కూడా మిలితమై ఉంది. ఇప్పుడు అదే వ్యక్తి 30 సంవత్సరాల కాలానికి రూ. 1 కోటి జీవిత బీమా కోసం కేవలం రూ. 699 చెల్లిస్తే సరిపోతుంది. ఇంకా, అదే కవర్ మరియు కాలపరిమితి కోసం 30 ఏళ్ల ధూమపానం చేయని మహిళ ఇప్పుడు జిఎస్టి తో సహా రూ. 697కి బదులుగా రూ. 594 నెలవారీ ప్రీమియం చెల్లిస్తే సరిపోతుంది.
ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కో లిమిటెడ్ చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ శ్రీ వికాస్ గుప్తా మాట్లాడుతూ, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కో లిమిటెడ్ వద్ద, నిజమైన విలువ మా కస్టమర్లకు సరైనది అందించటంలో ఉందని మేము నమ్ముతున్నాము. మేము మా కస్టమర్లకు తిరిగి ఇచ్చే ప్రతి పొదుపు ఈ నమ్మకాన్ని బలపరుస్తుంది, భరించగలిగే సామర్థ్యాన్ని పెంచుతుంది, నాణ్యమైన బీమా అందరికీ అందుబాటులో ఉండే భవిష్యత్తుకు దగ్గరగా చేస్తుంది. మరింత మంది వ్యక్తులను వారి భవిష్యత్తును భద్రపరచడానికి మొదటి అడుగు వేయమని ప్రోత్సహించడం ద్వారా రక్షణ అంతరాన్ని తగ్గించడానికి కంపెనీ చేస్తున్న ప్రయత్నాలను కూడా సంపూర్ణం చేస్తుంది అని అన్నారు.
ముఖ్యంగా, టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ఒక ఆర్థిక భద్రతా పరిపుష్టి, ఇది ఒక వ్యక్తి దగ్గర లేనప్పుడు కూడా అతని ప్రియమైనవారు రక్షించబడతారని నిర్ధారిస్తుంది. అందువల్ల, రక్షణ ఉత్పత్తులు అందరికీ అందుబాటులో ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యం. ఇంకా, తగ్గిన ప్రీమియంలు భీమా వ్యాప్తిని మరింతగా పెంచుతాయి, లక్షలాది మంది భారతీయుల జీవితాల్లో ఆర్థిక రక్షణను నింపే లక్ష్యానికి మద్దతు ఇస్తాయి.