Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హైదరాబాద్ బాచుపల్లిలో సరికొత్త ఎక్స్‌క్లూజివ్ బ్రాండ్ స్టోర్‌ని ప్రారంభించిన KAFF

Advertiesment
KAFF Kitchen Solution

ఐవీఆర్

, శుక్రవారం, 31 అక్టోబరు 2025 (23:33 IST)
హై-ఎండ్ మాడ్యులర్ కిచెన్ సొల్యూషన్స్‌లో అగ్రగామి బ్రాండ్‌గా పేరు తెచ్చుకుంది KAFF ఇండియా. భారతీయ ఇళ్లకు సరికొత్త ఆవిష్కరణలతో ఎప్పటికప్పుడు చక్కదనం, పనితీరును అందిస్తున్న KAFF ఇప్పుడు తన ప్రయాణంలో భాగంగా మరో మైలురాయిని అందుకుంది. హైదరాబాద్ బాచుపల్లిలో తన కొత్త ప్రత్యేకమైన బ్రాండ్ స్టోర్‌ని ప్రారంభించినట్లు ప్రకటించింది.
 
షాప్ నెం. 8-9, సర్వే నెంబర్ నెం. 44, మక్త మహబూబ్ పేట్, మియాపూర్, క్రియేటివ్ గ్లాస్ పక్కన, హైదరాబాద్, తెలంగాణ- 500049 వద్ద ఉన్న ఈ కొత్త స్టోర్ వినియోగదారులకు ప్రీమియం అనుభవాన్ని అందిస్తుంది. KAFF యొక్క బిల్ట్ ఇన్ వంటగది ఉపకరణాలు, హార్డ్ వేర్, ఉపకరణాలు మరియు సింక్‌ల యొక్క మొత్తం శ్రేణిని ఒకే పైకప్పు క్రింద ప్రదర్శిస్తుంది.
 
ఆధునిక గృహయజమానులకు స్ఫూర్తినిచ్చేలా ఆలోచనాత్మకంగా రూపొందించబడిన ఈ స్టోర్, తమ వంటశాలలను సమర్థవంతమైన, స్టైలిష్ మరియు సమకాలీన ప్రదేశాలుగా మార్చుకోవాలనుకునే వారికి వన్-స్టాప్ డెస్టినేషన్‌గా పనిచేస్తుంది. సందర్శకులు అత్యాధునిక చిమ్నీలు, అధిక-పనితీరు గల కుక్ టాప్‌లు, బిల్ట్ ఇన్ ఓవెన్‌లు, డిష్ వాషర్లు, వైన్ కూలర్లు, మరిన్నింటి యొక్క విస్తృత ఎంపికను అన్వేషించవచ్చు. ఇవన్నీ అధునాతన డిజైన్‌ను ఉన్నతమైన కార్యాచరణతో కలపడానికి రూపొందించబడ్డాయి.
 
ఆధునిక జీవన శైలికి పెరుగుతున్నడిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని ఇక్కడ బాచుపల్లిలో మా కొత్త షోరూమ్‌ని ప్రారంభించడం మాకు సంతోషంగా ఉంది అని KAFF ఇండియా COO శ్రీ నళిన్ కుమార్ అన్నారు. KAFFలో, అధునాతన సాంకేతికత, ఉన్నతమైన డిజైన్, రోజువారీ సౌలభ్యాన్ని మిళితం చేసే వంటగది పరిష్కారాలను అందించడానికి మేము కృషి చేస్తున్నాము. ఈ కొత్త స్టోర్ ద్వారా వినియోగదారులు తమ కలల వంటగదులను సృష్టించేటప్పుడు సజావుగా, స్ఫూర్తిదాయకమైన అనుభవాన్ని అందించడానికి మా నిరంతర నిబద్ధతను ప్రతిబింబిస్తుంది అని అన్నారు ఆయన.
 
తమ కొత్త బాచుపల్లి స్టోర్ ప్రారంభంతో, KAFF భారతదేశం అంతటా తన రిటైల్ పుట్ ప్రింట్‌ను విస్తరిస్తూనే ఉంది. వినియోగదారులకు ప్రపంచ స్థాయి వంటగది ఆవిష్కరణలను దగ్గరగా అనుభవించే అవకాశాన్ని అందిస్తుంది. బాచుపల్లిలోని KAFF బ్రాండ్ స్టోర్ ఇప్పుడు వినియోగదారుల కోసం సిద్ధంగా ఉంది. ఇది కస్టమర్లను ఆవిష్కరణ, గాంభీర్యం, పనితీరు యొక్క పరిపూర్ణ సమ్మేళనాన్ని ఒకే చోట చూడమని ఆహ్వానిస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విడాకులు తీసుకున్న 38 ఏళ్ల మహిళతో 23 ఏళ్ల యువకుడు ఎఫైర్, కొత్త లవర్ రావడంతో...