Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

2020లో మీరు మోసపోవచ్చు.. ఎలా?

2020లో మీరు మోసపోవచ్చు.. ఎలా?
, శనివారం, 28 డిశెంబరు 2019 (14:45 IST)
మరికొన్ని రోజుల్లో కొత్త సంవత్సరం రానుంది. 2019 సంవత్సరానికి గుడ్‌బై చెబుతూ 2020ని ఆహ్వానించనున్నాం. అయితే, ఈ కొత్త సంవత్సరంలో చాలా మంది మోసపోయే అవకాశం ఉందని గణిత మేధావులు చెబుతున్నారు. ఎందుకంటే.. కొత్త సంవత్సరంలో తేదీలు వేసే సమయంలో ఈ మోసం జరిగే అవకాశం ఉందని వారి అభిప్రాయం. ముఖ్యంగా. చెక్కులపై లేదా లీగల్ డాక్యుమెంట్లపై తేదీ వేసేసమయంలో జర జాగ్రత్తగా ఉండాలని సలహా ఇస్తున్నారు. 
 
సాధారణంగా తేదీలను డీడీ-ఎంఎం-వైవై ఫార్మెట్లలో వేస్తుంటారు. అంటే తేదీ, నెలకు సంబంధించిన సంఖ్య విషయంలో ఎలాంటి గందరగోళం లేకపోయినప్పటికీ సంవత్సరం అంకె వేసే సమయంలో మాత్రం తప్పకుండా మోసం జరగవచ్చని వారు అంటున్నారు. చాలా మందికి సంవత్సరం వేసేందుకు రెండు అంకెలను మాత్రమే వేస్తుంటారు. ఇలాంటి అలవాటు ఉన్నవారికి తప్పకుండా ప్రమాదం ఉంటుందన్నది వారి హెచ్చరికగా ఉంది. 
 
ఉదాహరణకు 13వ తేదీ జనవరి 2020 సంవత్సరం అని రాయడానికి 13/01/20 అని రాశారంటే కోరి కొరివి తెచ్చుకున్నట్లే. దాన్ని ఎవరైనా ట్యాంపర్‌ చేసి 2000 నుంచి 2099 వరకు ఏ అంకెనైనా చివర్లో వేసుకొనే అవకాశం ఉంది. భవిష్యత్తులో ఆ డాక్యుమెంటునే మీకు వ్యతిరేకంగా వినియోగించుకొనే ప్రమాదం ఉంది. 
 
అందుకే, 2020 సంవత్సరంలో ఏడాదంతా తేదీ వేసేటప్పుడు 'డిడి-ఎంఎం-వైవైవైవై' ఫార్మట్‌నే పాటించాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. సోమరితనానికి పోకుండా సంవత్సరం మొత్తం 2020 అని రాయాలి. అలా చేయకపోతే ఫ్రాడ్‌కు చేజేతులా అవకాశం ఇచ్చిన వాళ్లం అవుతాం. 2021 సంవత్సరం వచ్చాక మళ్లీ వందేళ్లపాటు ఏళ్లపాటు మీ ఇష్టం వచ్చినట్టుగా సంవత్సరం అంకెను వేసుకోవచ్చు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

క్లాస్‌మేట్‌తో పడకసుఖం పొందేందుకు వెళ్ళి మృత్యువాత.. ఎక్కడ?