Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

క్లాస్‌మేట్‌తో పడకసుఖం పొందేందుకు వెళ్ళి మృత్యువాత.. ఎక్కడ?

Advertiesment
క్లాస్‌మేట్‌తో పడకసుఖం పొందేందుకు వెళ్ళి మృత్యువాత.. ఎక్కడ?
, శనివారం, 28 డిశెంబరు 2019 (14:28 IST)
తెలంగాణ రాష్ట్రంలో మరో వివాహేతర హత్య జరిగింది. తన క్లాస్‌మేట్‌తో పడక సుఖం పొందేందుకు వెళ్లిన ఓ వివాహితుడు మృత్యువాతపడ్డాడు. మహిళ తమ్ముడు, అతని స్నేహితులు కర్రలతో దాడి చేయడంతో ఆ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. 
 
ఈ ఘటన భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం చిన్నకొడపాకలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కాజీపేట మార్కెట్‌ సమీపంలో నివాసం ఉంటున్న ఓ మహిళతో క్లాస్‌మేట్‌ అయిన పెరుమాళ్ల భిక్షపతి(45) కొంతకాలంగా అక్రమ సంబంధం ఉంది. దీన్ని గుట్టుచప్పుడు కాకుండా కొనసాగిస్తూ వచ్చాడు. 
 
ఈ క్రమంలో భిక్షపతి శనివారం అర్థరాత్రి సదరు మహిళను కలుసుకునేందుకు కాజీపేట మార్కెట్‌ సమీపంలోని ఆ మహిళ ఇంటికి వెళ్లాడు. ఈ విషయం పసిగట్టిన మహిళ తమ్ముడు మాడ సదానందం, మరిది సుధాకర్‌ అక్రమ సంబంధం విషయంపై భిక్షపతిని నిలదీశారు. అపుడు వారిమధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. దీంతో భిక్షపతిపై వారు కర్రలతో దాడిచేశారు. 
 
ఈ క్రమంలో భిక్షపతి పక్కనే ఉన్న రాళ్లపై పడిపోయి తీవ్ర గాయాలపాలయ్యాడు. పరిస్థితి చేయి దాటిపోయిందని గమనించిన సదానందం, సుధాకర్‌.. 108కు సమాచారం అందించి భిక్షపతిని ఎంజీఎంకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారు జామున భిక్షపతి మృతి చెందాడు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

త్వరలో రాజధానిపై ప్రకటన.. విశాఖలో ఇక రోజూ పండగే : విజయసాయి రెడ్డి