బాత్‌వేర్ బ్రాండ్‌లో ఎంతో ప్రసిద్ధిపొందిన పొందింది హింద్‌వేర్. ఇప్పటికే ఎన్నో ఉత్పత్తులతో వినియోగదారులను ఆకట్టుకున్న హింద్‌వేర్ థాట్‌ఫుల్ ఈజ్ బ్యూటిఫుల్ అనే పేరుతో క్యాంపెయిన్ మొదలుపెట్టింది. క్యాంపెయిన్‌లో భాగంగా ఎన్నో కొత్త ఉత్పత్తుల్ని ప్రవేశపెట్టింది. ఇప్పుడు మరోసారి థాట్‌ఫుల్ ఈజ్ బ్యూటిఫుల్ క్యాంపెయిన్‌ని మొదలుపెట్టింది. ఈ క్యాంపెయిన్‌లో భాగంగా సెన్సార్ ఆధారిత ఫౌసెట్‌లు మరియు వాటర్ క్లోసెట్ లాంటి సరికొత్త టచ్ ఫ్రీ ఉత్పత్తుల్ని ప్రవేశపెడుతోంది.
మహమ్మారి వేళ ఇలాంటి టచ్ ఫ్రీ ఉత్పత్తులతో భారతీయ ఇళ్లలో మెరుగైన భద్రత మరియు పరిశుభ్రతను పెంచేందుకు ఇలాంటి ఉత్పత్తుల్ని సిద్ధం చేస్తోంది. హింద్‌వేర్ టచ్ ఫ్రీ ఉత్తత్తులు ఎంతో అద్భుతంగా ఉంటాయి. వీటి ప్రయోజనాలను వివరించేలా కొత్త టీవీసీ రూపొందించారు. ఇందులో వినియోగదారులకు అవసరమైన ఉత్పత్తి పరిష్కారాలపై ప్రధానంగా దృష్టి సారించారు. వినియోగదారుల జీవితాన్ని సులభతరం చేయడానికి రూపొందించిన ఉబెర్ చిక్ సాంకేతిక పరిష్కారాలు, అద్భుతమైన డిజైన్ మరియు కార్యాచరణను వివరించే వీటిని రూపొందించారు.
ఈ సందర్బంగా బ్రిలోకా లిమిటెడ్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ సందీప్ సోమని మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ... ఒక కంపెనీగా, మేము ఎప్పటికప్పుడు సరికొత్త ఆవిష్కరణలు చేసేందుకు సిద్ధంగా ఉంటాము. అలాగే మా వినియోగదారుల జీవితాలకు విలువను అందించే ప్రత్యేకమైన ఉత్పత్తి సమర్పణలను రూపొందించడానికి ఎప్పటికప్పుడు కృషి చేస్తూనే ఉంటాము.
మహమ్మారి సమయంలో, వినియోగదారుల ప్రాధాన్యతలలో మార్పు వచ్చింది. పరిశుభ్రత మరియు భద్రత పరిగణనలోకి తీసుకునే ప్రధాన అంశాలుగా మారాయి. ఆరోగ్యం మరియు పరిశుభ్రతపై వినియోగదారులకు ఎక్కువ దృష్టి ఉండడంతో... బాత్‌వేర్ మరియు ఫౌసెట్‌లను స్మార్ట్ సొల్యూషన్స్‌తో కొనేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ఇది కాకుండా, వినియోగదారుల్లో పర్యావరణ పరిరక్షణపై కూడా ఆసక్తి పెరిగింది. దీంతో... మరింత స్థిరమైన మరియు నీటిని సంరక్షించే ఉత్పత్తులను ఎంచుకోవడానికి కూడా మొగ్గు చూపుతున్నారు అని అన్నారు ఆయన.
ఈ సందర్బంగా బ్రిలోకా బాత్ బిజినెస్ చీప్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ సుధాన్షు పోఖ్రియాల్ మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ... హింద్‌వేర్ వినూత్న విధానం, కార్యాచరణ మరియు విజువల్ అప్పీల్‌కు ప్రసిద్ధి చెందింది. వాటిపై ఎప్పటికప్పుడు దృష్టి పెడుతుంది. కానీ కాలం మారినప్పుడు మన చుట్టూ ఉన్న ప్రపంచం కూడా వేగంగా అభివృద్ధి చెందుతుంది. అలాంటప్పుడు ఇళ్లలో మెరుగైన భద్రతను కల్పించడానికి, టచ్ ఫ్రీ మరియు కాంటాక్ట్‌లెస్ ఉత్పత్తుల కోసం కూడా డిమాండ్ వేగంగా పెరుగుతోంది.
గతంలో ఇలాంటి ఉత్పత్తులను కొనుక్కోవడం అనేది వాణిజ్యపరమైన వెంచర్లు లేదా వ్యాపారాల నుండి ఎక్కువగా ఉండేది, కానీ భద్రతా ఆందోళనలు పెరిగే కొద్దీ, వినియోగదారులు కూడా అలాంటి ఉత్పత్తుల వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో భవిష్యత్తులో ఇంటి వినియోగదారుల నుంచి కూడా ఇలాంటి డిమాండ్ మరింతగా వస్తుందని మేం ముందే ఊహించాము. ఈ సరికొత్త ప్రచారంతో, మేము కొత్త వినియోగదారులకు హింద్‌వేర్ అందించే విభిన్నమైన వినూత్న మరియు సమర్థవంతమైన పరిష్కారాల గురించి మరింత అవగాహన కల్పించాలనుకుంటున్నాము అని అన్నారు ఆయన.
ఈ ప్రచారాన్ని వివిధ రాష్ట్రాల్లో ఉన్న వినియోగదారుల కోసం వివిధ భాషల్లో రూపొందించారు. హిందీ, కన్నడ, తమిళం, తెలుగు, మలయాళం, బెంగాలీ వంటి భాషలలో వీటిని రూపొందించారు. అంతేకాకుండా ప్రచారాన్ని మరింత పెంచడానికి త్వరలో వీటిని టీవీ, డిజిటల్, ఆన్‌లైన్, సోషల్ మీడియా ఛానెల్‌లతో సహా మీడియా ప్లాట్‌ఫామ్‌లలో కూడా ప్రచారం చేయబోతున్నారు.