కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) పరిధికి 70:30 నిష్పత్తిలో రెండు తెలుుగు రాష్ట్రాలకు నీటిని కేటాయించాలని ఏపీ ప్రభుత్వం మరోమారు లేఖరాసింది. ఈ నీటిని 50:50 నిష్పత్తిలో నీటిని కేటాయించాలంటూ కేఆర్ఎంబీకి తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. దీంతో ఏపీ అభిప్రాయాన్ని కేఆర్ఎంబీ కోరగా, దీనికి ఏపీ సర్కారు ఓ లేఖ రాసింది.
2021-22 గాను 70:30 నిష్పత్తిల్లోనే కృష్ణా జలాల పంపకం జరగాలని ప్రస్తావించించింది. 50:50 నిష్పత్తిలో నీటి పంపకాలపై కేఆర్‌ఎంబీ లేఖకు ప్రత్యుత్తరం ఇచ్చింది. 50:50 నిష్పత్తిలో నీటి పంపకాలు జరగాలని తెలంగాణ డిమాండ్ చేయగా.. తెలంగాణ చేసిన డిమాండ్‌పై కేఆర్‌ఎంబీ ఏపీ అభిప్రాయం కోరింది.
ఉమ్మడి ప్రాజెక్టుల్లో నీటి పంపకాలను ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు చేయలేదని ఏపీ అభిప్రాయపడింది. మరోవైపు కేఆర్‌ఎంబీ సర్వసభ్య సమావేశం వాయిదా పడింది. వాస్తవానికి ఈ నెల 27నే ఈ సమావేశం జరగాల్సి ఉండగా.. సెప్టెంబరు 1కు వాయిదా వేసినట్టు తెలిపారు.