Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హెచ్‌సీసీబీ తమ ఉద్యోగులకు బంపర్ ఆఫర్, కావలసినవన్నీ ఇంటికే..

హెచ్‌సీసీబీ తమ ఉద్యోగులకు బంపర్ ఆఫర్, కావలసినవన్నీ ఇంటికే..
, గురువారం, 8 అక్టోబరు 2020 (21:30 IST)
భారతదేశంలో అత్యున్నత ఎఫ్‌ఎంసీజీ కంపెనీలలో ఒకటైన హెచ్‌సీసీబీ, తమ ఉద్యోగుల కోసం వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ విధానాన్ని తీసుకువచ్చింది. మహమ్మారి తరువాత కాలమంతా ఈ విధానం అమలులో ఉంటుంది. ఉద్యోగులు శాశ్వతంగా వర్క్ ఫ్రమ్‌ హోమ్‌ విధానాన్ని ఎంచుకోవచ్చు.

అయితే వారు భౌతికంగా హాజరు కావాల్సిన అవసరం లేని పని ప్రాంగణాలలో మాత్రమే ఇది వర్తిస్తుంది (ఫ్యాక్టరీ, సేల్స్‌ మొదలైనవి మినహాయింపు). సంరక్షణ, వశ్యతను అందించాలనేది సంస్థ యొక్క ప్రాథమిక సిద్ధాంతం. ఉద్యోగుల భద్రత, వారి భావోద్వేగ, శారీరక సంక్షేమం కోసం ఈ విధాన ప్రక్రియలు తీసుకురావడంతో పాటుగా పని- ఇంటి స్ధలం యొక్క సౌందర్యానికి  తగినట్లుగా నగదు మద్దతును సైతం అందించనుంది.
 
మొదటి అడుగుగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దిన కుర్చీలను తమ ఆఫీస్‌ నుంచి అర్హత కలిగిన ఉద్యోగుల ఇళ్లకు తరలించడం ప్రారంభించింది. బెంగళూరులోని తమ ప్రధాన కార్యాలయం నుంచి, అభ్యర్థించిన ఉద్యోగుల ఇళ్లకు బదిలీ చేసింది. తమతమ నగరాలలో పనిచేయాలనుకునే ఉద్యోగులకు ఈ కుర్చీలను కొనుగోలు చేసుకునే అవకాశం ఉంది. అవాంతరాలు లేని ఇంటర్నెట్‌ కనెక్టివిటీ యొక్క ఆవశ్యకతను గుర్తించి, హెచ్‌సీసీబీ ఇప్పుడు యుపీఎస్‌ లేదా పవర్‌ బ్యాకప్‌ సహా నెలవారీ వైఫై ఖర్చుల కోసం తగిన నగదు మద్దతును సైతం హెచ్‌సీసీబీ అందిస్తుంది.
 
కుర్చీలు కొనుగోలు చేయడం, హెడ్‌ఫోన్లు, ల్యాంప్‌లు, వెబ్‌కామ్‌, ఎక్సటర్నల్‌ మైక్రోఫోన్‌, ఆఖరకు కాఫీ మగ్‌ లేదా ఫ్లవర్‌ ఎరేంజ్‌మెంట్‌ కొనుగోలు కోసం కూడా ఉద్యోగులు నగదు మద్దతు పొందవచ్చు. శారీరక మరియు భావోద్వేగ సవాళ్లను అధిగమించేందుకు, కంపెనీ ఇప్పుడు టెలిమెడిసన్‌ సదుపాయాలతో పాటుగా వెల్‌నెస్‌ కౌన్సిలింగ్‌ను సైతం 1 టు 1 హెల్ప్‌ సహాయం ద్వారా అందించనుంది. అతి సులభంగా డౌన్‌లోడ్‌ చేసుకునేందుకు యాప్‌ అందుబాటులో ఉండటంతో పాటుగా దీనిని చాట్‌బాట్‌ ద్వారా నిర్వహిస్తారు.
 
తమ ఆరోగ్యం మరియు శ్రేయస్సు గురించి వారు కంపెనీకి తగిన సమాచారం అందించేందుకు దీనిని వినియోగించుకోవచ్చు. కంపెనీ తమ ఆరోగ్య బీమా పాలసీని మార్చడంతో పాటుగా తల్లిదండ్రులు, అత్తమామలను సైతం జోడించే విధానం తీసుకువచ్చింది అలాగే, తమపై ఆధారపడ్డవారికి సైతం తగిన టాపప్‌ కవర్‌ను అందిస్తుంది. ఈ పాలసీని సంస్ధలో అత్యధిక సంఖ్యలోని ఉద్యోగులు అందించిన ఇన్‌పుట్స్‌ తీసుకుని ప్రత్యేకంగా డిజైన్‌ చేశారు.
 
ఈ పాలసీని శ్రీ ఇంద్రజీత్‌ సేన్‌ గుప్తా, సీహెచ్‌ఆర్‌ఓ-హెచ్‌సీసీబీ వివరిస్తూ, ‘‘ఈ పాలసీని సానుభూతి, సౌకర్యం అందించాలని రూపొందించాం. దీని ద్వారా ఉద్యోగులు మరియు వారిపై ఆధారపడ్డ వారు సురక్షితమన్న భావన కలిగి ఉండటంతో పాటుగా తాము పనిచేసే ప్రాంతాలతో సంబంధం లేకుండా సౌకర్యం అనుభవించగలరు. ఈ విధానం వెనుక ఉద్యోగులకు క్లిష్టత లేని అనుభవాలను అందించడంతో పాటుగా కంపెనీతో పాటుగా ఉద్యోగులకు అర్ధవంతమైన అనుభవాలను అందించాలన్నది లక్ష్యం. ఈ పాలసీలో వినూత్నమైన ఫీచర్‌ ఏమిటంటే, మా సహచర ఉద్యోగులే దీనిని సృష్టించడం. వారికి తమ సమస్యలను గురించి అత్యుత్తమంగా అవగాహన ఉంది. ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి అందువల్ల, ఈ పాలసీలో ఏవైనా మార్పులు అవసరమైతే మార్పులు చేసేందుకు సిద్ధంగా ఉన్నాము’’ అని అన్నారు.
 
ఈ పాలసీలో భాగంగా శిక్షణా కార్యక్రమాలు మరియు మద్దతు మెటీరియల్స్‌ను  అందించడం ద్వారా ఉద్యోగులకు ప్రభావవంతంగా తమరోజును నిర్వహించడంతో పాటుగా మరింత ఉత్పాదకతతో, డిజిటల్‌ అలసట తగ్గించుకుని, నూతన విధానపు వర్కింగ్‌ను స్వీకరించడంలో సహాయపడనున్నారు. ఈ కంపెనీ ఇప్పుడు లింకెడిన్‌ లెర్నింగ్‌ మరియు హార్వార్డ్‌ మేనేజ్‌ మెంటార్‌ శిక్షణ కార్యక్రమాలను సైతం అందుబాటులో ఉంచింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఓరి యెంకమ్మో... విమానం సీటు కిందే 3 కిలోల బంగారం పెట్టుకొచ్చాడు, చెన్నైలో చిక్కారు